UPSC Exams Calendar 2024: యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ - 2024 విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్-2024ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 10న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది.
యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్-2024ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 10న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు పరీక్షల వివరాలను చూసుకోవచ్చు. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది(2024) మే 26న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 2 నుంచి మార్చి 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష ద్వారానే నిర్వహించనున్నారు. ఇక ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 2024, సెప్టెంబరు 20 నుంచి 5 రోజులపాటు సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-I, 2024; కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్)-I, 2024 పరీక్షలను ఏప్రిల్ 21న నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 2023, డిసెంబరు 20 నుంచి 2024, జనవరి 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదేవిధంగా యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-II, 2024; కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్)-II, 2024 పరీక్షలను సెప్టెంబరు 9న నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 2024, మే 15 నుంచి 2024, జూన్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
➥ యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షను 2024, ఫిబ్రవరి 18న నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు సెప్టెంబరు 6 నుంచి 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదేవిధంగా యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షను 2024, జూన్ 23న నిర్వహించనున్నారు.
➥ కంబైన్డ్ జియో సైంటిస్ట్ (ప్రిలిమ్స్) పరీక్షను 2024, ఫిబ్రవరి 18న నిర్వహించనున్నారు. దరఖాస్తులను 2023, సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 10 వరకు స్వీకరించనున్నారు.
➥ సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ (ఎగ్జిక్యూటివ్) ఎల్‌డీసీఈ-2024 పరీక్షను మార్చి 10న నిర్వహించనున్నారు. అభ్యర్థుల నుంచి 2023, నవంబరు 29 నుంచి డిసెంబరు 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పరీక్షల పూర్తి క్యాలెండర్ ఇలా..
Also Read:
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్‌లో 77 జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టులు, వివరాలు ఇలా!
జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ జూనియర్ ఓవర్‌మ్యాన్ ఖాళీల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దీనిద్వారా మొత్తం 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా/ డిగ్రీ(మైనింగ్ ఇంజినీరింగ్)తో పాటు వ్యాలిడ్ ఓవర్‌మ్యాన్‌షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..