By: ABP Desam | Updated at : 06 May 2023 07:45 PM (IST)
Edited By: omeprakash
బీసీసీఎల్ నోటిఫికేషన్
జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ జూనియర్ ఓవర్‌మ్యాన్ ఖాళీల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దీనిద్వారా మొత్తం 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా/ డిగ్రీ(మైనింగ్ ఇంజినీరింగ్)తో పాటు వ్యాలిడ్ ఓవర్‌మ్యాన్‌షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* జూనియర్ ఓవర్‌మ్యాన్(గ్రేడ్-సి)
* స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(ఎస్సీ- 10, ఎస్టీ- 62, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 05)
మొత్తం ఖాళీలు: 77
అర్హత: డిప్లొమా/ డిగ్రీ(మైనింగ్ ఇంజినీరింగ్)తో పాటు వ్యాలిడ్ ఓవర్‌మ్యాన్‌షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.జ
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ.1180.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను రిజిస్టర్డ్/ స్పీడ్ పోస్టు ద్వారా సంబంధిత చిరునామాకి పంపాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
బేసిక్ పే: నెలకు రూ.31,852.56.
చిరునామా: General Manager(P&IR), Bharat Coking Coal Limited, Koila Bhawan, Koila Nagar, BCCL Township Post, Dhanbad, Jharkhand
దరఖాస్తుకు చివరి తేదీ: 25.05.2023.
Notification
Also Read:
ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌సీఈఆర్‌టీలో 347 ఉద్యోగాలు- వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 347 పోస్టులను భర్తీ చేయనున్నారు. సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీచేస్తారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 19 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
BEL Recruitment: బెల్‌లో 205 ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు, వివరాలు ఇలా!
BEL Jobs: బీఈఎల్‌లో ప్రొబేషనరీ, సీనియర్ ఇంజినీర్ పోస్టులు, అర్హతలివే!
AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!
GDS Recruitment: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు ఇక నాలుగు రోజులే గడువు, వివరాలు ఇలా!
Navy Recruitment: నావల్ డాక్‌యార్డులో 281 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా!
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?
Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!