UPSC Recruitment: కేంద్ర కొలువుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ - ఖాళీల వివరాలు
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు బట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* మొత్తం పోస్టులు: 56
1) ఏరోనాటికల్ ఆఫీసర్: 26 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్.
2) ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్: 01 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ సివిలియన్ పర్సనల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్.
3) సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II: 20 పోస్టులు
విభాగం: డీఆర్‌డీవో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్.
4) సైంటిస్ట్-బి: 07 పోస్టులు
విభాగం: బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమెట్ చేంజ్.
5) అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్: 02 పోస్టులు
విభాగం: జీఎస్‌ఐ, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్.
అర్హతలు: పోస్టులవారీగా బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: పోస్టులవారీగా 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.25 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
జీతం: రూ. 47600 నుంచి రూ.151100 వరకు (పోస్టులను బట్టి).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.08.2023.
ALSO READ:
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌ఐఓహెచ్ అహ్మదాబాద్‌లో 54 టెక్నికల్ పోస్టులు, వివరాలు ఇలా!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..