By: ABP Desam | Updated at : 05 Nov 2022 12:13 PM (IST)
యూజీసీ నెట్ ఫలితాలు
పీహెచ్‌డీ, అసిస్టెంట్ లెక్చర్‌షిప్ అర్హత కోసం నిర్వహించిన యూజీసీ నెట్ ఫలితాలు శనివారం (నవంబరు 5న) విడుదల కానున్నాయి. నవంబర్ 5న పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చనుంది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అభ్యర్థులు www.ugcnet.nta.nic.in, www.ntaresults.nic.in వెబ్‌సైట్లలో తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఈ అర్హత పరీక్షకు సంబంధించిన తుది కీని ఎన్‌టీఏ విడుదల చేసింది. యూజీసీ నెట్ పరీక్షను అక్టోబర్ 8, 10, 11, 12, 13, 14 తేదీల్లో దేశవ్యాప్తంగా ఎన్‌టీఏ నిర్వహించింది.
UGC-NET results will be announced by National Testing Agency (NTA) on 5th November (Saturday). The results will be available on NTA website https://t.co/HMrF8NRnOv#UGC-NET
— Mamidala Jagadesh Kumar (@mamidala90) November 4, 2022
యూజీసీ నెట్ ఎగ్జామ్‌ను ఈ ఏడాది నాలుగు విడతలుగా నిర్వహించారు. తొలి విడతలో జూలై 9 నుంచి జూలై 12 వరకు, రెండో విడత సెప్టెంబరు 20 నుంచిసెప్టెంబరు 23 వరకు నిర్వహించారు. ఇక నెట్ ఎగ్జామ్ మూడో విడత సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 వరకు, నాలుగో విడత అక్టోబరు 8 నుంచి అక్టోబరు 14 వరకు నిర్వహించారు.
ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..
సబ్జెక్టుల వారీగా ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
ఏటా లక్షలాది మంది విద్యార్థులు పీహెచ్‌డీలో చేరేందుకు లేదా ప్రొఫెసర్‌గా అధ్యాపక వృత్తిలో చేరేందుకు నెట్ ఎగ్జామ్ రాస్తారు. యూజీసీ నిర్వహించే ఈ నెట్ పరీక్ష.. అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం ప్రాథమిక అర్హత పరీక్ష. ఇందులో ఉత్తీర్ణులైతే దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాల్లలో అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నెట్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవాలి?
అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
1. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక సైట్ సందర్శించాలి. సైట్ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2: హోం పేజీలో డిస్‌ప్లే ఆఫ్ రిజల్ట్స్ అండ్ ఫైనల్ ఆన్సర్ కీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
3: అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ ఇవ్వడం ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబరు, డేటాఫ్ బర్త్ వివరాలు ఇవ్వడం ద్వారా కూడా లిగిన్ అవ్వొచ్చు.
4: అవసరమైన వివరాలు నింపిన తరువాత అభ్యర్థులు తమ రిజల్ట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Also Read:
Post Office Jobs: పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు, ఖాళీల వివరాలివే!
దేశంలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్టు తెరలెపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 98,083 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రీజియన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్లనున్నట్లు ప్రకటించింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
SSC MNS: మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల, మహిళలకు ప్రత్యేకం
GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>