Navy Jobs: ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100
ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్
మొత్తం పోస్టులు: 217
1) ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ - 121 పోస్టులు
- జనరల్ సర్వీస్/హైడ్రో కేడర్: 56
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 05
- నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 15
- పైలట్: 25
- లాజిస్టిక్స్-20
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉండాలి. లాజిస్టిక్స్ పోస్టులకు బీఈ/బీటెక్ (లేదా) ఎంబీఏ(లేదా) బీఎస్సీ/బీకామ్/బీఎస్సీ(ఐటీ)తోపాటు పీజీ డిప్లొమా (ఫైనాన్స్/లాజిస్టిక్స్/సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్/మెటీరియల్ మేనేజ్‌మెంట్) లేదా ఎంసీఏ/ఎంఎస్సీ(ఐటీ) అర్హత ఉండాలి. పైలట్ ఎంట్రీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డీజీసీఏ జారీచేసిన కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కలిగి ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
2) ఎడ్యుకేషన్ బ్రాంచ్ - 12 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/ఆపరేషన్స్ రిసెర్చ్/ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/కెమిస్ట్రీ) లేదా బీఈ/బీటెక్/ఎంటెక్ అర్హత ఉండాలి.
3) టెక్నికల్ బ్రాంచ్ - 84 పోస్టులు
- ఇంజినీరింగ్ బ్రాంచి(జనరల్ సర్వీస్): 25 పోస్టులు
- ఎలక్ట్రికల్ బ్రాంచి(జనరల్ సర్వీస్): 45 పోస్టులు
- నావల్ కన్‌స్ట్రక్టర్: 14 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్.
వయోపరిమితి: పోస్టులవారీగా వయోపరిమితి నిర్ణయించారు. కొన్ని పోస్టులకు 02.07.1998 - 01.01.2004 మధ్య; కొన్ని పోస్టులకు 02.07.1998 - 01.01.2002 మధ్య, కొన్ని పోస్టులకు 02.07.1999 - 01.01.2004 మధ్య, కొన్ని పోస్టులకు 02.07.1998 - 01.01.2004 మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది.
జీతభత్యాలు: ప్రారంభ వేతనంగా నెలకు రూ.56100 ఇస్తారు. ఇతర అలవెన్సులు అదనం.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 06.11.2022.
Also Read
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1422 ఉద్యోగాలు, పూర్తి వివరాలివే!
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్‌లో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్‌లో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...