అన్వేషించండి

TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజినీర్ (01/2023), జూనియర్ లైన్‌మ్యాన్ (01/2023) పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్ఎస్‌పీడీసీఎల్) అసిస్టెంట్ ఇంజినీర్ (01/2023), జూనియర్ లైన్‌మ్యాన్ (01/2023) పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రస్తుతానికి పత్రిక ప్రకటనను మాత్రమే సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 15 లేదా ఆలోపే ఉద్యోగాల భర్తీక సంబంధించిన పూర్తి నోటిఫికేష్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందబాటులో ఉంచనున్నట్లు సంస్థ తెలిపింది. 

వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 1,601.

1) జూనియర్ లైన్‌మ్యాన్: 1553 పోస్టులు

అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) అర్హత ఉండాలి.

వయోపరిమితి: జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.24,340- రూ.39405 ఉంటుంది.

2)  అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 48 పోస్టులు

అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.64,295- రూ.99,345 ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్‌మ్యాన్ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.


TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
'సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2023' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 1) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 21 వరకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?
ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌-2023 నోటిఫికేషన్‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఫిబ్రవరి 1న విడుదల చేసింది. దీనిద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 405 ఉద్యోగాలు, అర్హతలివే! జీతమెంతో తెలుసా?
బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో పనిచేయడానికి మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అందరికీ మార్కులు కలపాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.   
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget