By: ABP Desam | Updated at : 02 Feb 2023 09:11 AM (IST)
Edited By: omeprakash
యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ 2023 ఎగ్జామ్
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 1న విడుదల చేసింది. దీనిద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. మే 28న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షనే దీనికి కూడా ప్రామాణికంగా భావిస్తారు. మెయిన్ పరీక్షను మాత్రం విడిగా నిర్వహిస్తారు. తదనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేస్తారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు...
* ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్- 2023
ఖాళీల సంఖ్య: 150.
అర్హత: డిగ్రీ (యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ బోటనీ/ కెమిస్ట్రీ/ జియాలజీ/ మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్/ జువాలజీ) (లేదా) డిగ్రీ (అగ్రికల్చరల్/ ఫారెస్ట్రీ/ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.08.2023 నాటికి 21 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1991 - 01.08.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షనే దీనికి కూడా ప్రామాణికంగా భావిస్తారు. మెయిన్ పరీక్షను మాత్రం విడిగా నిర్వహిస్తారు. తదనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేస్తారు.
Also Read: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
ముఖ్యమైన తేదీలు...
➛ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2023.
➛ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.02.2023.
➛ దరఖాస్తుల సవరణ తేదీలు: 22.02.2023 - 28.02.2023 వరకు.
➛ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేది: 28.05.2023.
Also Read:
పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 40 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 40,889 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించిన టీఎస్ పీఎస్సీ తాజాగా మంగళవారం నాడు మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది.
గ్రూప్-1 మెయన్స్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Group 1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలివే?
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?