అన్వేషించండి

TSPSC Group1 Mains: జూన్‌లో 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పరీక్షలు, షెడ్యూలు ప్రకటన ఎప్పుడంటే?

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు  వెల్లడించింది. పరీక్ష షెడ్యూలును జనవరి 18న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు చెప్పింది.

తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ జనవరి 13న అర్ధరాత్రి వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా 1:50 నిష్పత్తిలో 503 పోస్టులకు మొత్తం 25,050 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు  వెల్లడించింది. పరీక్ష షెడ్యూలును జనవరి 18న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు చెప్పింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ ప్రకటన విడుదల చేశారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సందేహాల నివృత్తికి కమిషన్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-22445566 లేదా 040-23542185 లేదా 040-23542187 ఫోన్ నంబర్లలో helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్‌లో సంప్రదించాలని సూచించింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

మెరితా జాబితా రూపకల్పన ఇలా..
గ్రూప్-1 ప్రధాన పరీక్షకు హారిజెంటల్ విధానంలో 1:50 నిష్పత్తి చొప్పున అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేసింది. నిబంధనల మేరకు మల్టీజోన్లు, రిజర్వుడు వర్గాల వారీగా మెరిట్ సాధించిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని జాబితా ప్రకటించింది. గతంలో టాప్‌లో ఉన్న అభ్యర్థులను 1:50 నిష్పత్తి చొప్పున ఎంపిక చేసేవారు. దీంతో కొన్ని రిజర్వుడు కేటగిరీల్లో అభ్యర్థులు ప్రధాన పరీక్షకు ఎంపికయ్యేవారు కాదు. దీంతో ఆయా పోస్టులు ఖాళీగా మిగిలి పోతున్నాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ, క్రీడల కోటా రిజర్వేషన్ల మేరకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. తద్వారా అన్ని కేటగిరీల్లోని పోస్టులకు ఆ వర్గానికి చెందిన 50 మంది చొప్పున పోటీపడేందుకు అవకాశం లభించింది. అదేవిధంగామహిళా రిజర్వేషన్లలోనూ హారిజాంటల్ విధానాన్ని టీఎస్‌పీఎస్సీ అమలు చేసింది. 

ఆ అభ్యర్థులపై నివేదిక తర్వాత చర్యలు.. 
'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షలో సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ డీసేల్స్ హైస్కూల్‌లో అల్లరి చేసిన అభ్యర్థికి అర్హత మార్కులు రాకపోవడంతో ప్రధాన పరీక్షకు ఎంపిక కాలేదు. నిబంధనలు ఉల్లంఘించిన ఆ అభ్యర్థిపై చర్యలు కొనసాగించాలని కమిషన్ నిర్ణయించింది. అతనితో పాటు ఆ ఘటనలో పాల్గొన్న మిగతా 47 మందిపై విచారణ నివేదిక అనంతరం చర్యలు చేపట్టనుంది. తప్పుడు బబ్లింగ్ చేసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను నిబంధనల మేరకు మూల్యాంకనం చేయలేదు.

కటాఫ్ మార్కులు లేకుండానే..
యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ నిబంధనల ప్రకారం కటాఫ్ మార్కులు వెల్లడించే సంప్రదాయం లేనందున.. ఆ పద్ధతినే కొనసాగించింది. అయితే ప్రిలిమినరీ పరీక్షలో కనీస అర్హత మార్కుల్లేవని కమిషన్ వెల్లడించింది. మెరిట్ ప్రకారం ప్రధాన పరీక్షకు ఎంపికచేసినట్లు తెలిపింది.

మార్కుల గణన ఇలా...
గ్రూప్-1 పరీక్షలో మొత్తం 150 మార్కులకు 5 ప్రశ్నలను తొలగించినందున 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను 150 మార్కులకు దామాషా పద్ధతిలో తుది మార్కులను కమిషన్ లెక్కించింది. ఉదా: 145 మార్కులకు 120వస్తే 150కి లెక్కించి 124.137గా నిర్ణయిస్తారు. ఇలా మూడో డెసిమల్ పాయింట్ వరకు పరిగణనలోకి తీసుకొని తుది మెరిట్ జాబితాను రూపొందించింది. ఇద్దరు లేదా అంతకు ఎక్కువ మంది అభ్యర్థులకు సమానంగా మార్కులు వచ్చినపుడు తెలంగాణ స్థానికతకు తొలి ప్రాధాన్యమిచ్చింది. ఆ తర్వాత పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకున్నామని వివరించింది. అధిక వయసు కలిగిన అభ్యర్థికి ఎక్కువ ర్యాంకు ఇచ్చామని తెలిపింది.

Also Read:

తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget