TSPSC Group1 Prelims Results: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల! మెయిన్స్‌కు 25,050 మంది ఎంపిక! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 12న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది.
తెలంగాణ రాష్ట్ర తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 13న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్ఫత్తిలో 25,050 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. జూన్‌లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.
గ్రూప్-1 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Webnote:
మెయిన్స్‌కు 25,150 మంది!
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు భారీగా అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 503 పోస్టులకు గాను 3,80,081 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిసారిగా ప్రిలిమినరీ ‘కీ’తో పాటే ప్రతి ఒక్క అభ్యర్థి ఓఎంఆర్ షీట్‌ను వెబ్‌సైట్‌లో ఉంచింది. అయితే, గ్రూప్-1 ప్రిలిమినరీ నుంచి మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ సమయంలోనే వెల్లడించింది. అంటే, 503 ఉద్యోగాలకు మొత్తం 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. మల్టీజోన్, రిజర్వుడ్ వర్గాల వారీగా జాబితాను టీఎస్‌పీఎస్సీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఫలితాలు వెల్లడైనా వెంటనే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు కమిషన్ భావిస్తోంది. అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీపై వారం, పదిరోజుల్లోనే స్పష్టత రానుంది.
మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,85,916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీని విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది టీఎస్‌పీఎస్సీ. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన సందేహాలపై సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి, 5 ప్రశ్నలను తొలగించారు. అనంతరం నవంబర్ 15వ తేదీన తుది కీని ప్రకటించారు. మాస్టర్ ప్రశ్నాపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించి, ఫలితాలను విడుదల చేసింది.
Also Read: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్! ఫలితాల ఆలస్యానికి కారణమిదే!
తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..