TGPSC Group1 Prelims Key: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్ పరీక్ష ఆన్సర్ 'కీ' వచ్చేస్తోంది, ఎప్పుడంటే?
Group1 Prelims Answer Key: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ని 'కీ' టీజీపీఎస్సీ జూన్ 13న విడుదలచేయనుంది అభ్యర్థుల నుంచి.జూన్ 13 నుంచి 17 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది.
![TGPSC Group1 Prelims Key: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్ పరీక్ష ఆన్సర్ 'కీ' వచ్చేస్తోంది, ఎప్పుడంటే? TSPSC Group 1 prelims answer key along with master question papers can be downloaded from TGPSC website from June 13th TGPSC Group1 Prelims Key: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్ పరీక్ష ఆన్సర్ 'కీ' వచ్చేస్తోంది, ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/0a7101763e2972d1d48d9fbdd8a9349f1718210883249522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Group1 Prelims Answer Key: తెలంగాణలో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ని 'కీ'ని జూన్ 13న విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) జూన్ 12న ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ తెలిపింది. అభ్యర్థులకు ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ( Group1 Answer key Objections) తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు జూన్ 17న సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు తెలపాలి.
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకీ టీజీపీఎస్సీ (TGPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గ్రూప్-1 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జూన్ 9న OMR విధానంలో పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 895 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 3.02 లక్షల మంది మాత్రమే (74 శాతం) ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు.
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు విడుదల..
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1లో మొత్తం 536 పోస్టులుండగా.. మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మంది అభ్యర్థులను మెయిన్‌కు ఎంపికచేయనున్నారు.
మెయిన్స్ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 21.10.2024: జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్)
➥ 22.10.2024: పేపర్-1 (జనరల్ ఎస్సే)
➥ 23.10.2024: పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
➥ 24.10.2024: పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)
➥ 25.10.2024: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)
➥ 26.10.2024: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)
➥ 26.10.2024: పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ)
మెయిన్స్ పరీక్ష విధానం: మొత్తం 900 మార్కులకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరును 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ పేపరును కేవలం అర్హత పరీక్షకాగా.. మిగతా ఆరు పేపర్లను ప్రధాన పేపర్లుగా పరిగణిస్తారు. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయించారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
ALSO READ:
➥ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే
➥ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా
➥ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో 176 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుండాలి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)