అన్వేషించండి

TS SI, Constable Application: కానిస్టేబుల్, ఎస్‌ఐ 'పార్ట్-2' దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబరులో ఫిజికల్ ఎఫిషియెన్సీ, మెజర్‌మెంట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థులకు పంపించే లేఖల్లోనే వాటిని నిర్వహణ తేదీలను తెలియజేస్తారు.

తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలమినరీ రాతపరీక్షలో అర్హత సాధించి ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పార్ట్-2 దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అక్టోబరు 27న ఉదయం 8 నుంచి నవంబరు 10 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువును పొడగించబోమని పోలీసు నియామక మండలి స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పలువురు అర్హత సాధించిన నేపథ్యంలో దాదాపు 2.69 లక్షల మంది పార్ట్‌-2 దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని మండలి వర్గాలు వెల్లడించాయి. ఈ దరఖాస్తుల స్వీకరణ అనంతరం పీఎంటీ, పీఈటీల వేదికలు, తేదీల గురించి అభ్యర్థులకు వెబ్‌సైట్‌ ద్వారా ఇంటిమేషన్ లెటర్లు పంపించనన్నుట్లు తెలిపాయి.


ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాలు, ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..


నవంబరులో ఫిజికల్ టెస్టులు...
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించే అభ్యర్థులకు నవంబరులో ఫిజికల్ ఎఫిషియెన్సీ, మెజర్‌మెంట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పంపించే లేఖల్లోనే వాటిని నిర్వహించే వేదిక, పరీక్ష తేదీ వివరాలను నియామక మండలి వెల్లడించనుంది.

ఈవెంట్లు ఇలా..
ఫిజికల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట పరుగు పందెం నిర్వహిస్తారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో లాంగ్‌జంప్‌, షాట్‌పుట్ పోటీలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణిస్తారు. వీరికి మాత్రమే ఫైనల్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీ చేసి, పరీక్ష నిర్వహిస్తారు.


TS SI, Constable Application: కానిస్టేబుల్, ఎస్‌ఐ 'పార్ట్-2' దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?


Also Read:  Navy Jobs: ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100


తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు అక్టోబరు 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ, కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్స్, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్ కానిస్టేబుల్స్‌ ప్రాథమిక పరీక్షల ఫలితాలను తెలంగాణ స్టేట్‌ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఫలితాలతోపాటు కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని కూడా మండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను ఫైనల్ కీని అందుబాటులో ఉంచింది. ఫలితాల కోసం అభ్యర్థులు తమ మొబైల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేయాల్సి ఉంటుంది. 


Also Read:
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు


ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం ఇలా..

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో మొత్తం 41.67 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఎస్‌ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా, 1,05,603(46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్‌ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా, 1,84,861(31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా, 18,758(44.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518(43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

SI పోస్టుల్లో ఎస్టీ అభ్యర్థుల ముందంజ..

* SI పోస్టులకు సంబంధించి సగటు మార్కులు 47.25 వచ్చాయి. మొత్తం 200 మార్కులకు గాను మొదటిస్థానంలో నిలిచిన అభ్యర్థికి 133 మార్కులు వచ్చాయి. ఎక్కువ మంది సాధించిన మోడల్ మార్కు 36.80 కాగా 2,176 మంది ఈ మార్కులు సాధించారు. కేటగిరీల వారీగా చూస్తే.. అత్యధికంగా ఎస్టీ అభ్యర్థులు 59.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఎస్సీ అభ్యర్థులు 54.45%, మాజీ సైనికోద్యోగులు 49.12%, బీసీలు 42.06%, ఓసీలు 33.21% అర్హత సాధించారు. పురుషుల్లో 49.8%, మహిళా అభ్యర్థుల్లో 37.02% మంది అర్హులుగా నిలిచారు.

* కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి సగటు మార్కులు 41.16గా వెల్లడైంది. మొదటి స్థానంలో నిలిచిన అభ్యర్థికి 141 మార్కులు వచ్చాయి. మోడల్ మార్కులను (33.2) 7,518 మంది సాధించారు. కేటగిరీల వారీగా అభ్యర్థుల్లో.. మాజీ సైనికోద్యోగులు అత్యధికంగా 54.25% అర్హత సాధించారు. ఎస్సీలు 39.43%, ఎస్టీలు 37.97%, బీసీలు 27.1%, ఓసీలు 24.43% మంది అర్హులయ్యారు. పురుషుల్లో 32.56%, మహిళా అభ్యర్థుల్లో 28.35% అర్హత సాధించారు.


Also Read: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1422 ఉద్యోగాలు, పూర్తి వివరాలివే!


రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్‌ఐ పోస్టులకు  ఆగస్టు 7న, అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ రాతపరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget