Staff Nurse Results: తెలంగాణ స్టాఫ్ నర్సు పరీక్ష ఫలితాలు విడుదల, ఫైనల్ కీ అందుబాటులో
Staff Nurse Results: తెలంగాణలో స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు.
MHSRB Staff Nurse Results: తెలంగాణలో స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చని టీఎస్‌హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(MHSRB) డిసెంబరు 18న ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులకు సంబంధించిన రోస్టర్ పాయింట్లను డిసెంబరు 15న విడుదల చేయగా.. దీనిపై అభ్యంతరాలను డిసెంబరు 20లోపు ఆన్‌లైన్ ద్వారా తెలపవచ్చని సూచించింది.
రాష్ట్రంలో మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆగస్టు 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 40 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఆగస్టు 7న విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్సర్ 'కీ' అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తాజాగా తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను MHSRB విడుదల చేసింది.
Click here for marks and other details of applicants of Staff Nurse Examination
************************************************************************
ALSO READ:
ఇండియన్ నేవీలో 910 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ నేవీ- సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ (INCET-01/2023) నోటిఫికేషన్‌ను విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 910 ఛార్జ్‌మ్యాన్ (Chargeman), సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (Senior Draughtsman), ట్రేడ్స్‌మ్యాన్ మేట్ (Tradesman Mates) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 18న ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.295 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటెలిజెన్స్ బ్యూరో హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ (SA), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నియామక పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో డిసెంబర్ 20న పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..