అన్వేషించండి

INCET Application: ఇండియన్ నేవీలో 910 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?

INCET: ఇండియన్ నేవీలో ఛార్జ్‌మ్యాన్, సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 18న ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

Indian Navy Chargeman INCET 01/2023 Recruitment: ఇండియన్ నేవీ- సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ (INCET-01/2023) నోటిఫికేషన్‌ను విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 910 ఛార్జ్‌మ్యాన్ (Chargeman), సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (Senior Draughtsman), ట్రేడ్స్‌మ్యాన్ మేట్ (Tradesman Mates) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 18న ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.295 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తుల పరిశీలన ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించిన తుది ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000 - రూ.56,900 వరకు జీతంతోపాటు ఇతర భత్యాలు ఉంటాయి. 

వివరాలు..

* ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌సెట్‌-01/ 2023)

ఖాళీల సంఖ్య: 910 పోస్టులు

I. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘బి (ఎన్‌జీ)’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్

➥ ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్‌ వర్క్‌షాప్): 22 పోస్టులు

➥ ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ): 20 పోస్టులు

➥ సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఎలక్ట్రికల్): 142 పోస్టులు

➥ సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్): 26 పోస్టులు

➥ సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్‌స్ట్రక్షన్‌): 29 పోస్టులు

➥ సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కార్టోగ్రాఫిక్): 11 పోస్టులు

➥ సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఆర్మమెంట్): 50 పోస్టులు

జీత భత్యాలు: నెలకు రూ.35,400-రూ.1,12,400.

II. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్

➥ ట్రేడ్స్‌మ్యాన్ మేట్: 610 పోస్టులు

➜ ఈస్టర్న్ నావల్ కమాండ్: 09

➜ వెస్టర్న్ నావల్ కమాండ్: 565

➜ సౌతర్న్ నావల్ కమాండ్: 36

ట్రేడులు: కార్పెంటర్, సివిల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, సెంట్రల్ ఎయిర్ కండీషన్ ప్లాంట్ మెకానిక్, కంప్యూటర్ హార్డువేర్ & నెట్‌వర్క్ మెయింటనెన్స్,  కంప్యూటర్ ఆపరేటర్ & సీవోపీఏ, డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఎలక్ట్రోప్లేటర్, ఇండస్ట్రియల్ పెయింటర్, ప్లంబర్, సర్వేయర్ తదితర ట్రేడ్లు.

జీత భత్యాలు: నెలకు రూ.18,000-రూ.56,900.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31.12.2023 నాటికి ఛార్జ్‌మ్యాన్/ ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులకు 25 సంవత్సరాలు. సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: రూ.295. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

ముఖ్య తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.12.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.12.2023.

Online Application

Website

                       

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget