అన్వేషించండి

GL Posts: జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను కొనసాగింపుపై మధ్యంతర ఉత్తర్వులు! హైకోర్టు ఏమందంటే?

తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని హైకోర్టు జులై 21న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత విద్యాసంవత్సరాల్లో నియమితులైన గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించాలని ఆదేశించింది.

తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు జులై 21న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత విద్యాసంవత్సరాల్లో నియమితులైన గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించాలని ఆదేశించింది. జూనియర్‌ కాలేజీల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం జులై 18న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ ఇప్పటికే ఇంటర్ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజా నియామకాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు అర్హులైన గెస్ట్‌ ఫ్యాకల్టీని ఈ ఏడాది కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, ఇంటర్ కమిషనరేట్‌కు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.

తెలంగాణలోని జూనియర్‌ కళాశాలల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి అధ్యాపకులను ఎంపిక చేయాలని ఇంటర్‌ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీని నియమించి, పీజీ మార్కుల ఆధారంగా, జిల్లా వారీగా 1:3 నిష్పత్తిలో దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా జులై 19న నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. షెడ్యూలు ప్రకారం జులై 27న అభ్యర్థుల మెరిట్‌ జాబితా ప్రకటిస్తారు. జులై 28న తుది ఎంపిక చేసి, నియామకపత్రాలు ఇస్తారు. నియామక పత్రాలు పొందిన వారు ఆగస్టు 1లోపు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

పీజీ‌ అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికా‌రి కార్యాలయంలో జులై 24లోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రిన్సిపాల్‌లతో కూడిన కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అభ్యర్థులు పీజీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 

జిల్లాలవారీగా పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

ఏకలవ్య పాఠశాలల్లో 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు - పూర్తి వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని 'నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(నెస్ట్స్‌)' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 6,329 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 5,660 టీజీటీ, 669 హాస్టల్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 18 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, 'స్టేజ్-2' దరఖాస్తు తేదీలు వెల్లడి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని ఏపీ పోలీసు నియామక మండలి జులై 19న వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎస్‌ఐ (సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జులై 21న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3న సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని బోర్డు తెలిపింది. అభ్యర్థులందరూ సంబంధిత సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget