APSLPRB: ఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల 'స్టేజ్-2' దరఖాస్తు తేదీలు వెల్లడి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. అభ్యర్థులకు జులై 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని ఏపీ పోలీసు నియామక మండలి జులై 19న వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఎస్‌ఐ (సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జులై 21న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3న సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని బోర్డు తెలిపింది. అభ్యర్థులందరూ సంబంధిత సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులకు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు తదితర చోట్ల దేహ దారుఢ్య, శరీర సామర్ధ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అభ్యర్థులు (38 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు.
పోలీసుశాఖలో మొత్తం 6511 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నవంబర్ 28న ఏపీ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు, అదేవిధంగా 6100 సివిల్, రిజర్వు పోలీసు కానిస్టేబుల్ (పురుషులు, మహిళలు) పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయా పోస్టులకు వేర్వేరుగా నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో లక్షా 53వేల మంది అభ్యర్ధులు అర్హత సాధించారు.
ఎస్‌ఐ ఉద్యోగాలకు సంబంధించి 'స్టేజ్-2' ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తిచేసిన అభ్యర్ధులు దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరైన సమయంలో అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆరోజు అభ్యర్థికి సంబంధించి పదోతరగతి సర్టిఫికెట్, విద్యార్హత, కమ్యూనిటీ, స్దానికత, ఇతర అర్హత ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒరిజినల్ పత్రాలు సమర్పించేందుకు ఎలాంటి గడువు పొడిగింపు ఉండబోదని, అంతా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జరుగుతుందని, ప్రాథమిక అర్హతకు సంబంధించిన పత్రాలు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తీసుకెళ్లాలని పోలీసు నియామక బోర్డు సూచించింది. అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాతే.. ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన తేదీలు ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌లోగా రెండో దశ ప్రక్రియ పూర్తికానున్నట్లు సమాచారం.
🔰 ఫిజికల్ ఈవెంట్లు ఇలా..
➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
🔰 మెయిన్ పరీక్ష విధానం:
➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
➨ సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
➨ ఏపీఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.
➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
పోస్టుల వివరాలు..
* సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు
ఖాళీల సంఖ్య: 411
1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) ఎస్‌ఐ- సివిల్ (మెన్/ఉమెన్): 315 పోస్టులు
జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..
జోన్ | జిల్లా/ఏరియా | పోస్టులు |
జోన్-1 (విశాఖపట్నం) | శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం | 50 |
జోన్-2 (ఏలూరు) | తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా | 105 |
జోన్-3 (గుంటూరు) | గుంటూరు, ప్రకాశం, నెల్లూరు | 55 |
జోన్-4 (కర్నూలు) | చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప | 105 |
మొత్తం | 315 |
2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 96 పోస్టులు
జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..
జిల్లా | ఖాళీల సంఖ్య |
ఎచ్చెర్ల- శ్రీకాకుళం | 24 |
రాజమహేంద్రవరం | 24 |
మద్దిపాడు - ప్రకాశం | 24 |
చిత్తూరు | 24 |
మొత్తం | 96 |
ALSO READ:
ఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, తుది ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తికావడంతో.. వారంరోజుల్లో ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైనవారి తుది జాబితాను తెలంగాణ పోలీసు నియామకబోర్డు విడుదల చేయనుంది. అభ్యర్థుల వ్యక్తిగత ప్రవర్తన, నేరచరిత్రపై స్థానిక పోలీసు స్టేషన్ల నుంచి వివరాలు సేకరించిన తర్వాత అభ్యర్థులకు నియామపత్రాలు అందజేయనున్నారు. అభ్యర్థులకు ఆగస్టు నుంచే పోలీసు శిక్షణ ప్రారంభంకానుంది. కానిస్టేబుల్ తుది జాబితాను కూడా రెండు వారాల్లో వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తుది రాతపరీక్షలో ఎంపికైన వారిలో నుంచి 97,175 మంది అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో నుంచే కటాఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను తయారు చేస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial