Ind vs SA 2nd Test: టీమిండియాతో పాటే గౌహతికి గిల్.. మరి రెండో టెస్టులో కెప్టెన్ ఆడతాడా? BCCI అప్డేట్ ఇదే
India vs South Africa 2nd Test News గువాహటి టెస్ట్ ముందు భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టులో ఆడటం కష్టమే అనిపిస్తుంది. తొలి టెస్టులో గాయపడిన గిల్ కు విశ్రాంతి అవసరం.

IND vs SA 2nd Test: భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య రెండవ టెస్ట్ నవంబర్ 22న గౌహతిలో ప్రారంభం కానుంది. అంతకుముందు టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ టెస్టులో టీమ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆడటం దాదాపుగా కష్టమని తెలుస్తోంది. కోల్‌కతా టెస్టు సందర్భంగా అతనికి నెక్ స్ప్యాజమ్ వచ్చింది. దీని వల్ల గిల్ ఆసుపత్రిలో కూడా చేరాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోయిన గిల్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్‌కు దిగలేదు. ఇప్పుడు గిల్ నవంబర్ 18న ఈడెన్ గార్డెన్స్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు. కెప్టెన్ కోలుకోవడానికి ఇంకా 5 నుండి 7 రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. గిల్ కోలుకుంటున్నాడని తెలిపిన బోర్డు.. రెండో టెస్టులో ఆడటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుత సమాచారం ప్రకారం, శుభ్‌మన్ గిల్ జట్టుతో గౌహతికి వెళ్తాడు అని బీసీసీఐ తెలిపింది. కానీ జట్టుతో పాటు గౌహతికి వెళ్లినా కూడా రెండో టెస్టులో గిల్ ఆడకపోవచ్చు. తనకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. రెండో టెస్టులో గిల్ ఆడటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బోర్డు పేర్కొంది. గిల్ ఆడకపోతే, రిషబ్ పంత్ రెండో టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. టీమ్ మేనేజ్‌మెంట్ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. అయితే భారత్ ప్లేయింగ్ XIలో పెద్ద మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి.
BCCI (@BCCI) posts, "Medical Update: Shubman Gill Team India captain Shubman Gill suffered a neck injury on Day 2 of the Kolkata Test against South Africa and was taken to the hospital for examination after the end of day's play. He was kept under observation and discharged the… pic.twitter.com/CnHY9YC2Yk
— Press Trust of India (@PTI_News) November 19, 2025
జట్టులోకి ఇతడి రాక ఖాయం
BCCI యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని అధికారికంగా టెస్ట్ జట్టులోకి చేర్చుకుంది. ఈడెన్ గార్డెన్స్ టెస్టుకు ముందు నితీష్ ను రిలీజ్ చేసింది. తద్వారా అతను ఇండియా A జట్టులో భాగం అయ్యాడు. గౌహతి టెస్టులో గిల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారడంతో సెలెక్టర్లు వెంటనే నితిష్ రెడ్డిని తిరిగి పిలిపించారు.
నవంబర్ 18న జట్టు ప్రత్యామ్నాయ శిక్షణా శిబిరంలో నితిష్ రెడ్డి పాల్గొన్నాడు. అతడు జట్టులో చేరడంతో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ లో మార్పులు చేయడం ఖాయం. గిల్ ఆడకపోతే నితీష్ రెడ్డికి నేరుగా ప్లేయింగ్ XIలో అవకాశం లభిస్తుంది. సీనియర్లు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
నితిష్ రెడ్డి గణాంకాలు
నితీష్ రెడ్డి తన టెస్ట్ కెరీర్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 386 పరుగులు చేశాడు. ఇందులో ఒక అద్భుతమైన సెంచరీ ఉంది. అది కూడా ఆస్ట్రేలియాపై చేయడం విశేషం. బౌలింగ్‌లో 8 వికెట్లు తీశాడు. IPL 2024లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత ఈ తెలుగు తేజం నిరంతరం భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఫోకస్‌లో ఉన్నాడు.
భారత్ ఆటగాళ్లు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, నితీష్ రెడ్డి
గిల్ అందుబాటులో లేకపోతే కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. లేనిపక్షంలో రాహుల్ కు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యత అప్పగించే అవకాశం లేకపోలేదు.





















