SVIMS Recruitment: తిరుపతి స్విమ్స్‌లో 100 ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఎండీ లేదా ఎంఎస్ లేదా డీఎన్‌బీతో పాటు నిర్ణీత పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 100
* ఫ్యాకల్టీ పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 76
విభాగాలు: అనాటమీ, అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాక్ సర్జరీ, కార్డియాలజీ, క్లినికల్ హెమటాలజీ, క్లినికల్ ఇమ్యునాలజీ & రుమటాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండోక్రినాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆబ్టోమెటికాలజీ, పీడియాట్రిక్స్,పాథాలజీ, ఫార్మకాలజీ,ఫిజియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సైకియాట్రీ, రేడియేషన్ ఆంకాలజీ, రేడియో-డయాగ్నోసిస్, రెస్పిరేటరీ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, యూరాలజీ, వైరాలజీ
అసోసియేట్ ప్రొఫెసర్లు: 20
విభాగాలు: బయోకెమిస్ట్రీ, కార్డియాక్ సర్జరీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒబెస్ట్ట్రిక్స్ & గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఒటో రైనో లారిన్జాలజీ, పీడియాట్రిక్స్, యూరాలజీ
ప్రొఫెసర్లు: 04
విభాగాలు: ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఆప్తాల్మాలజీ, సైకియాట్రీ.
అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎండీ లేదా ఎంఎస్ లేదా డీఎన్‌బీ చేసి ఉండాలి. నిర్ణీత అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: ప్రొఫెసర్ స్కేల్-1: 58 సంవత్సరాలు మించకూడదు. అసోసియేట్ ప్రొఫెసర్ /అసిస్టెంట్ ప్రొఫెసర్: 50 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, బీసీ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమర్పించాలి.
చిరునామా: The Registrar, SriVenkateswara Institute of Medical Sciences(SVIMS),
Alipiri Road, Tirupati – 517 507, Andhra Pradesh.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
ALSO READ:
ఐవోసీఎల్‌లో 1720 ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు, అర్హతలివే
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్), రిఫైనరీస్ డివిజన్ ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1720 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలుగల అభ్యర్థులు నవంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ- రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..