SAIL Trainee Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 200 ఉద్యోగాలు
రూర్కెలాలోని ఇస్పాట్ జనరల్ హాస్పిటల్‌లో ఒక సంవత్సరం పాటు 200 ట్రైనీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) పలు శిక్షణ కోర్సుల్లో ట్రైనీస్ కోసం నియామక ప్రకటన విడుదల చేసింది. రూర్కెలాలోని ఇస్పాట్ జనరల్ హాస్పిటల్‌లో ఒక సంవత్సరం పాటు 200 ట్రైనీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
మొత్తం పోస్టులు: 200.
1) మెడికల్ అటెండెంట్ ట్రైనింగ్: 100 పోస్టులు
అర్హత: కనీసం మెట్రిక్ లేదా తత్సమానం.
స్టైపెండ్: నెలకు రూ.7,000.
2) క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనింగ్: 20 పోస్టులు
అర్హత: అభ్యర్థి ఒడిశాలోని గుర్తింపు పొందిన నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్ లేదా సెయిల్ ప్లాంట్ యూనిట్లు నిర్వహించే ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్-వైఫరీ కోర్సులో డిప్లొమా ఉత్తీర్ణత/ ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్.
స్టైపెండ్: నెలకు రూ.17,000.
Also Read: 6432 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తివివరాలు ఇలా!
3) అడ్వాన్స్‌డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనింగ్ (ASNT): 40 పోస్టులు
అర్హత: అభ్యర్థి ఒడిశాలోని గుర్తింపు పొందిన నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లేదా సెయిల్ ప్లాంట్ యూనిట్లు నిర్వహించే ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్-వైఫరీ కోర్సులో డిప్లొమా ఉత్తీర్ణత/ ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
4) డేటా ఎంట్రీ ఆపరేటర్/ మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్: 06
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. పీజీడీసీఏ కోర్సు చేసి ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9,000.
5) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్: 10
అర్హత: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డీఎంఎల్‌టీ కోర్సు చేసి ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9,000.
6) హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్: 10
అర్హత: ఎంబీఏ/బీబీఏ.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
Also Read: కోల్ఇండియాలో 481 పోస్టులు, నోటిఫికేషన్ పూర్తి వివరాలు
7) OT/ అనస్థీషియా అసిస్టెంట్ ట్రైనింగ్: 05
అర్హత: ఇంటర్. హాస్పిటల్ అటెండెంట్/అనస్థీషియా అటెండెంట్ విభాగాల్లో ఏడాది ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9,000.
8) అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ ట్రైనింగ్: 03
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ (బీపీటీ), ఇంటర్న్‌షిప్ ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.10,000.
9) రేడియో గ్రాఫర్: 03
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా (మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ).
స్టైపెండ్: నెలకు రూ.9,000.
10) ఫార్మసిస్ట్ : 03
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫార్మసీ లేదా బి. ఫార్మసీలో డిప్లొమా ఉత్తీర్ణత
స్టైపెండ్: నెలకు రూ.9,000.
Also Read: దేశ రాజధానిలో 547 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 20.08.2022.