SSC CGL Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 20,000
➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
➥ అసిస్టెంట్/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్
➥ ఇన్‌స్పెక్టర్ - సెంట్రల్ ఎక్సైజ్
➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
Also Read: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)
➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)
➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)
➥ అసిస్టెంట్
➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI/ CBN)/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌ఐఏ)
➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)
➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ)
➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)
➥ అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)
➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
➥ ట్యాక్స్ అసిస్టెంట్
➥ అప్పర్ డివిజన్ క్లర్క్.
Also Read: భారత వాతావరణ శాఖలో ఉద్యోగాలు, పోస్టులు-అర్హతల వివరాలు ఇలా!
అర్హత: 08-10-2022 నాటికి ఏదైనా డిగ్రీ. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.01.2022 నాటికి కొన్ని పోస్టులకు 18-27 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-30, కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. మరికొన్ని పోస్టులకు 18 - 32 సంవత్సరాలకు మించకూడదు. * నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు 3- సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు (డిసేబుల్డ్) - 8 సంవత్సరాలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 40-45 సంవత్సరాల వరకు, ఒంటరి/విడాకులు తీసుకున్న మహిళలకు 35-40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 పరీక్షల ద్వారా.
Also Read: ఎఫ్‌సీఐ 5043 ఉద్యోగాల భర్తీ - దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఇదే!
పరీక్ష స్వరూపం:
టైర్-1 పరీక్ష:
టైర్-2 పరీక్ష:
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2022.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.10.2022 (23:00)
- ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది: 08.10.2022 (23:00)
- ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 09.10.2022 (23:00)
- చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.10.2022.
- దరఖాస్తుల సవరణ: 12.10.2022 నుంచి 13.10.2022 (23:00) వరకు
- టైర్-1 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 2022 డిసెంబరులో.
- టైర్-2 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): ప్రకటించాల్సి ఉంది.
దక్షిణాదిలో పరీక్ష కేంద్రాలు:
* తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
* ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
* తమిళనాడులో పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, క్రిష్ణగిరి, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు.