FCI Recruitment: ఎఫ్‌సీఐ 5043 ఉద్యోగాల భర్తీ - దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఇదే!
FCIలో కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు 5 వరకు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా 5043 కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు 5 వరకు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రెండు దశల రాతపరీక్షలు, స్కిల్‌టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
* కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్: 5043 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు: నార్త్ జోన్-2388, సౌత్ జోన్-989, ఈస్ట్ జోన్-768, వెస్ట్ జోన్-713, నార్త్‌ఈస్ట్‌జోన్-185.
1. జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్): 48 పోస్టులు
2. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్): 15 పోస్టులు
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 73 పోస్టులు
4. అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్): 948 పోస్టులు
5. అసిస్టెంట్ గ్రేడ్-3(అకౌంట్స్): 406 పోస్టులు
6. అసిస్టెంట్ గ్రేడ్-3(టెక్నికల్): 1406 పోస్టులు
7. అసిస్టెంట్ గ్రేడ్-3(డిపో): 2054 పోస్టులు
8. అసిస్టెంట్ గ్రేడ్-3(హిందీ): 93 పోస్టులు
అర్హతలు:
* జూనియర్ ఇంజినీర్ సివిల్ పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
* జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్/మెకానికల్ పోస్టులకు ఎలక్ట్రికల్/మెకానికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
* స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 40 పదాలు టైప్ చేయగలగాలి. షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు టైప్ చేయగలగాలి.
* అసిస్టెంట్ గ్రేడ్ III జనరల్.. కంప్యూటర్‌లో ప్రావీణ్యతతో పాటు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కల్గి ఉండాలి.
* అసిస్టెంట్ గ్రేడ్ III అకౌంట్స్.. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ బి. కామ్‌తో పాటు కంప్యూటర్‌లో ప్రావీణ్యత కల్గి ఉండాలి.
* అసిస్టెంట్ గ్రేడ్ III టెక్నికల్.. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్. B.SC అగ్రికల్చర్ / బోటనీ / జువాలజీ / బయో టెక్నాలజీ / బయో కెమిస్ట్రీ / మైక్రోబయాలజీ / ఫుడ్ సైన్స్ లేదా ఫుడ్ సైన్స్ / ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ / అగ్రికల్చర్ ఇంజనీరింగ్ / బయో టెక్నాలజీలో BE / B.Tech లో ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ వినియోగంలో ప్రావీణ్యత కల్గి ఉండాలి.
* అసిస్టెంట్ గ్రేడ్ III డిపో.. కంప్యూటర్ వినియోగంలో ప్రావీణ్యతతో పాటు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
* అసిస్టెంట్ గ్రేడ్ III హిందీ.. హిందీని ప్రధాన సబ్జెక్ట్‌గా కలిగి ఉన్న బ్యాచిలర్ డిగ్రీ మరియు ఇంగ్లీషు నుండి హిందీ అనువాదం చేయగలగాలి.
వయోపరిమితి: 01.08.2022 నాటికి 27-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్(స్టెనో పోస్టులకు) ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
పరీక్ష విధానం:
ఫేజ్-1 పరీక్ష విధానం
ఫేజ్-2 పరీక్ష విధానం:
జీతం:
* జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు రూ.34,000 - రూ.1,03,400. ఇతర భత్యాలు అదనం.
* స్టెనోగ్రాఫర్ పోస్టులకు రూ.30,500 - రూ.88,100. ఇతర భత్యాలు అదనం.
* అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు రూ.28,200 - రూ.79,100. ఇతర భత్యాలు అదనం.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫేజ్-1 పరీక్షా కేంద్రాలు: నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.09.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.10.2022. (4 PM)
దరఖాస్తుల్లో మార్పులకు చివరితేది: 05.10.2022. (4 PM)
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ: 06.09.2022 - 05.10.2022 (4 PM)
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 20.10.2022.
Also Read
డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, నాబార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ!
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 100 ఇంజినీర్ పోస్టులు, అర్హతలివే!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని బెల్ కేంద్రంలో ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రెండేళ్ల తాత్కాలిక ప్రాదిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..