AP BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 100 ఇంజినీర్ పోస్టులు, అర్హతలివే!
రెండేళ్ల తాత్కాలిక ప్రాదిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని బెల్ కేంద్రంలో ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రెండేళ్ల తాత్కాలిక ప్రాదిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు..
* మొత్తం ఖాళీలు: 100.
పోస్టుల వారీగా ఖాళీలు..
1) ట్రెయినీ ఇంజినీర్: 40 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్– 17, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-11, ఎస్సీ-06, ఎస్టీ-03.
అర్హత: 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ (సీఎస్ఈ/ఐటీ/ఐఎస్). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పాసైతే చాలు.
వయోపరిమితి: 01.09.2022 నాటికి 28 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు (కనీసం 40 శాతం వైకల్యం) 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
పని అనుభవం: అవసరం లేదు.
జీతం: మొదటి సంవత్సరం రూ. 30,000, రెండో సంవత్సరం రూ.35,000.
2) ప్రాజెక్ట్ ఇంజినీర్: 60 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్–24, ఈడబ్ల్యూఎస్-06, ఓబీసీ-16, ఎస్సీ-10, ఎస్టీ-04.
అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్-4 ఏళ్లు (ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యునికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/ కమ్యునికేషన్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.09.2022 నాటికి 32 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు (కనీసం 40 శాతం వైకల్యం) 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
పని అనుభవం: కనీసం 2 ఏళ్లు పని అనుభువం ఉండాలి. C, C++, జావా, వెబ్ టెక్నాలజీస్, లైనక్స్, విండోస్, ఆర్‌డీబీఎంఎస్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: మొదటి సంవత్సరం రూ. 40,000, రెండో సంవత్సరం రూ.45,000.
పని ప్రదేశం: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తుకు చివరితేది: 23.09.2022.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Manager (HR/ES&SW),
Bharat Electronics Limited,
Jalahalli Post, Bengaluru –560013.
Also Read:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5008 క్లర్క్ ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా క్లరికల్ కేడర్ కింద 5,008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 225 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 7 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. నవంబరులో ప్రిలిమినరీ పరీక్ష, డిసెంబరులో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 714 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అర్హతలివే!
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(ఎస్‌సీఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...