SBI Recruitment 2022: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5008 క్లర్క్ ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 7 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా క్లరికల్ కేడర్ కింద 5,008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 225 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 7 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. నవంబరులో ప్రిలిమినరీ పరీక్ష, డిసెంబరులో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలు....
★ మొత్తం పోస్టుల సంఖ్య: 5008
సర్కిల్ వారీగా ఖాళీలు:
1. అహ్మదాబాద్: 357
2. బెంగళూరు: 316
3. భోపాల్: 481
4. బెంగాల్: 376
5. భువనేశ్వర్: 170
6. చండీగఢ్: 225
7. చెన్నై: 362
8. దిల్లీ: 152
9. హైదరాబాద్: 225
10. జైపుర్: 284
Also Read: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 714 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అర్హతలివే!
11. కేరళ: 273
12. లఖ్ నవూ/ ఢిల్లీ - 631
13. మహారాష్ట్ర/ ముంబయి మెట్రో: 747
14. మహారాష్ట్ర: 50
15. నార్త్ ఈస్టర్న్: 359
విద్యార్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2022 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1994 - 01.08.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడీబ్ల్యూడీ (జనరల్/ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.1,99,00.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా. స్థానిక భాష (లోకల్ లాంగ్వేజ్ టెస్ట్) పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.
Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడాలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు, అర్హతలివే!
పరీక్ష విధానం:
I. ప్రిలిమినరీ పరీక్ష:
మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.
II. మెయిన్ ఎగ్జామ్:
మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష ఉంటుంది. మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు...
✪ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.09.2022.
✪ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.09.2022.
✪ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 12.10.2022.
✪ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్, 2022లో.
✪ మెయిన్ పరీక్ష తేది: డిసెంబర్ 2022/ జనవరి 2023లో ఉంటుంది.
Also Read:
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 226 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 226 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, నెలకు లక్షకుపైగా జీతం!
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సదరన్ రీజియన్ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..