AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, నెలకు లక్షకుపైగా జీతం!
ఈ పోస్టులకు కేవలం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
![AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, నెలకు లక్షకుపైగా జీతం! Airports Authority of India invites applications for the recruitment of various posts, Check Details Here AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, నెలకు లక్షకుపైగా జీతం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/96b1f98def02dd01e45c5d7ced7f70041661658944244522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సదరన్ రీజియన్ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 156 పోస్టులు
1) జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్) ఎన్‌ఈ-4: 132 పోస్టులు
2) జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్) ఎన్‌ఈ-4: 10 పోస్టులు
3) సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్) ఎన్‌ఈ -6: 13 పోస్టులు
4) సీనియర్ అసిస్టెంట్(అధికారిక భాష) ఎన్‌ఈ-6: 01 పోస్టు
అర్హత: పదోతరగతి, ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తగినంత అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 25-08-2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: అభ్యర్థులను రాతపరీక్ష (స్టేజ్-1), వైద్య, ఫిజికల్ టెస్ట్ (స్టేజ్-2), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 50 శాతం ప్రశ్నలను అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టులో నుంచి, మిగతా 50 శాతం ప్రశ్నలను జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ నుంచి అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50గా, ఇతరులకు 40గా నిర్ణయించారు.
జీతం: ఎంపికైన జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి 92,000, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.36,000 నుంచి 1,10,000 వరకు చెల్లిస్తారు.
పరీక్ష కేంద్రాలు: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సెంటర్స్‌ను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడలో ఏర్పాటు చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2022
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.09.2022
Also Read:
Also Read:
DRDO Recruitment: డీఆర్‌డీఓ -సెప్టంలో 1901 ఖాళీలు, అర్హతలివే!
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనేజేషన్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి(ఎస్‌టిఏ- B),టెక్నీషియన్-A (టెక్-A) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఝార్ఖండ్‌లోని బొకారో స్టీల్ ప్లాంట్‌లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)