Bank Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు, అర్హతలివే!
బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా బిజినెస్ కరెస్పాండెంట్ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బిజినెస్ కరెస్పాండెంట్ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు బీఈ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంబీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంగ్లిష్, హిందీ చదవడం,రాయడం వచ్చి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 20.
అర్హత: అభ్యర్ధులు బీఈ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంబీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంగ్లిష్, హిందీ చదవడం,రాయడం వచ్చి ఉండాలి.
Bank of Baroda,
Regional Office,
Bareilly District Region
35A/8 , Rampur Garden,
Opposite Prabha Talkies,
Bareilly, Uttar Pradesh
243001
Also Read:
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 207 టీచర్ పోస్టులు
AP DSC Notification: ఏపీలోని ఆదర్శ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా పీజీటీ, టీజీటీ, ఆర్ట్ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 17 వరకు ఫీజు చెల్లించి, ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఏపీ ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీ పాఠశాలల్లో 214 టీచర్ పోస్టులు
ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, సంగీత ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 17 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 18 వరకు కొనసాగనుంది. రాతపరీక్ష (టీఆర్టీ, టెట్ కమ్ టీఆర్టీ) ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఏపీటెట్ వెయిటేజీ ఉంటుంది.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
AP IEDSS: ఏపీ ఐఈడీఎస్‌ఎస్ ప్రత్యేక విద్యలో 81 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
ఏపీలో దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక విద్యకు సంబంధించి సెకండరీ స్టేజీ(ఐఈడీఎస్‌ఎస్)లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్(ప్రత్యేక విద్య) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభంకానుంది. దరఖాస్తుకు చివరితేది సెప్టెంబరు 18. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 24 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...