By: ABP Desam | Updated at : 17 Aug 2021 11:30 AM (IST)
SBI Recruitment 2021
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐలో మొత్తం 69 స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు సెప్టెంబర్ 2వ తేదీతో ముగియనుంది. దీని ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్), డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్), రిలేషన్‌షిప్ మేనేజర్ (ఓఎంపీ) సహా పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది.
ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షను సెప్టెంబర్ 25న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
వయోపరిమితి, దరఖాస్తు ఫీజు..
పోస్టుల ఆధారంగా వయోపరిమితి మారుతోంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితర పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టులకు 60 ఏళ్ల వరకు వయో పరిమితి ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా వారు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు..
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్) - 36
డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్) - 10
అసిస్టెంట్ మేనేజర్-ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 10
రిలేషన్‌షిప్ మేనేజర్ (ఓఎంపీ) - 6
అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ & కమ్యూనికేషన్) - 4
ప్రొడక్ట్ మేనేజర్ (ఓఎంపీ) - 2
సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ - 1
విద్యార్హత వివరాలు..
Also Read: IDBI Recruitment 2021: ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్..
Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఇంజినీరింగ్, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం!
Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు, నెలకు రూ.56 వేల జీతం, పూర్తి వివరాలివే!
AP Jobs: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 351 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, అర్హతలివే!
Anganwadi Posts: ఇంటర్ ఉంటేనే 'అంగన్వాడీ' ఉద్యోగం, త్వరలో 5 వేలకు పైగా పోస్టుల భర్తీ!
Visakha Agni veer Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, విశాఖలో 18 రోజుల పాటు అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ
CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam
BJP Office: బీజేపీ ఆఫీసు ముందు కారు కలకలం, లోపల సూట్‌కేసు - బాంబ్ స్క్వాడ్‌కు కాల్, ఫైనల్‌గా ట్విస్ట్!
AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !
Project K: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!