News
News
X

BSF Recruitment 2021: మీరు టెన్త్ పూర్తి చేసి ఉంటే రూ.69,100 జీతం వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయండిలా

BSF Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా స్పోర్ట్స్‌ కోటాలో 269 గ్రూప్ సీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

FOLLOW US: 
Share:

నిరుద్యోగులకు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లోని 269 గ్రూప్ సీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులకు బీఎస్ఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు సెప్టెంబర్ 22వ తేదీతో ముగియనుంది.

బాక్సింగ్, జూడో, స్విమ్మింగ్, క్రాస్ కంట్రీ, కబడ్డీ, వాటర్ స్పోర్ట్స్, జిమ్నాస్టిక్స్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్ సహా మొత్తం 21 విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో కొన్ని పోస్టులకు అమ్మాయిలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హత గల అభ్యర్థులు bsf.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

భారీ వేతనం..
ఎంపికైన అభ్యర్థులకు నెల వేతనం (లెవల్ 3 కింద) రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. దీంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి. డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. 

విభాగాల వారీగా ఖాళీలు.. 
మహిళలు: 
బాక్సింగ్ - 10, జూడో - 8, స్విమ్మింగ్ - 4,  క్రాస్ కంట్రీ - 2, ఆర్చరీ - 12, వాటర్ స్పోర్ట్స్- 6, వెయిట్ లిఫ్టింగ్ - 9, రెజ్లింగ్ - 10, అథ్లెటిక్స్ - 25, షూటింగ్ - 3  
పురుషులు: 
బాక్సింగ్ - 10, జూడో - 8, స్విమ్మింగ్ - 12, క్రాస్ కంట్రీ - 2, వాటర్ స్పోర్ట్స్ - 10, వెయిట్ లిఫ్టింగ్ - 8, ఆర్చరీ - 8, అథ్లెటిక్స్ - 20, రెజ్లింగ్ - 12, షూటింగ్ - 3, కబడ్డీ - 10, వుషూ - 11, జిమ్నాస్టిక్స్ - 8, హాకీ - 8, వాలీబాల్- 10, హ్యాండ్ బాల్ - 8, బాడీ బిల్డింగ్ - 6, తైక్వాండో - 10, ఈక్వెస్ట్రియన్- 2,  బాస్కెట్ బాల్ - 6, ఫుట్‌బాల్ - 8.

వయో పరిమితి, విద్యార్హత.. 
2021 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి. విద్యార్హత విషయానికి వస్తే.. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్పోర్ట్స్ కోటా పోస్టులు కనుక.. ఛాంపియన్‌షిప్, నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో పాల్గొన్నవారు, మెడల్స్ సాధించినవారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపింది. 

Also Read: SSB Head Constable Recruitment 2021: ఎస్ఎస్‌బీలో హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. రూ.81 వేల వరకూ జీతం..

Published at : 10 Aug 2021 12:20 PM (IST) Tags: Job Notifications Constable jobs BSF Recruitment 2021 BSF Recruitment BSF Jobs

సంబంధిత కథనాలు

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

SSC Selection Posts: 5369 సెలక్షన్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

SSC Selection Posts: 5369 సెలక్షన్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

IPRC Notification: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!

IPRC Notification: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

SAIL Recruitment: బొకారో స్టీల్ ప్లాంటులో 239 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - అర్హతలివే!

SAIL Recruitment: బొకారో స్టీల్ ప్లాంటులో 239 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - అర్హతలివే!

టాప్ స్టోరీస్

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా