SSB Head Constable Recruitment 2021: ఎస్ఎస్‌బీలో హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. రూ.81 వేల వరకూ జీతం..
SASHASTRA SEEMA BAL recruitment 2021: ఢిల్లీలోని సశస్త్ర సీమా బల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 115 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులను భర్తీ చేయనుంది.
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలోని సశస్త్ర సీమా బల్ (SASHASTRA SEEMA BAL) డైరెక్టరేట్ జనరల్ కింద పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 115 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ విద్యార్హత గలవారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), స్కిల్ టెస్ట్ (టైపింగ్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 (లెవల్ 4 ప్రకారం) వరకు ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సులు కూడా ఉంటాయి. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 22తో ముగియనుంది. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తోంది.
రిజర్వేషన్ల వారీగా ఖాళీలు..
జనరల్- 47
ఓబీసీ- 26
ఎస్సీ- 11
ఎస్టీ- 21
ఈడబ్ల్యూఎస్- 11
మొత్తం- 115
ముఖ్యమైన వివరాలు..
దరఖాస్తులకు ఆఖరు తేదీ: ఆగస్టు 22, 2021
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు వివరాలు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా వారు రూ.100 చెల్లించాలి.
వయసు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి.
విద్యార్హత: భారతదేశంలోని గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత సాధించాలి. అలాగే ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35 పదాలు (WPM) హిందీ భాషలో నిమిషానికి 30 పదాలు ఉండాలి.
SSCలో కానిస్టేబుల్ జాబ్స్..
కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 25,271 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. టెన్త్ పాస్ అయిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. ఎంపికైన వారి వేతనం (పే లెవల్ 3 ప్రకారం) నెలకు రూ.21,700 నుంచి 69,100 వరకు చెల్లిస్తారని తెలిపింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సహస్త్ర సీమా బల్ (SSB), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) తదితర విభాగాల్లో కానిస్టేబుళ్ల నియామకానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 22,424 పోస్టులు.. మహిళలకు 2847 పోస్టులున్నాయి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (Computer Based Examination), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (Physical Efficiency Test), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (Physical Standard Test), మెడికల్ ఎగ్జామినేషన్ (Medical Examination), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.