అన్వేషించండి

SBI PO Recruitment: ఎస్‌బీఐ 2000 పీవో పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీవో పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 7న ప్రారంభమైన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు అక్టోబరు 3తో ముగియనుంది. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

భారతదేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 7న ప్రారంభమైంది. కాగా.. దరఖాస్తు గడువు అక్టోబరు 3తో ముగియనుంది. వాస్తవానికి సెప్టెంబరు  27తో ముగియాల్సిన గడువును అక్టోబరు 3 వరకు పొడిగించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు..

* ప్రొబేషనరీ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 2,000 పోస్టులు

పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్‌- 200, యూఆర్‌- 810.

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.04.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు: నెలకు బేసిక్‌ పే రూ.41,960.

తెలుగు రాష్ట్రాల్లో ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు.

➥ దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు. (03.10.2023 వరకు పొడిగించారు)

➥ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2023, అక్టోబర్‌ రెండో వారంలో ప్రారంభం.

➥ స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్‌ 2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: నవంబర్‌, డిసెంబర్ 2023.

➥ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్‌/ డిసెంబర్‌ 2023.

➥ స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.

➥ ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.

➥ ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.

➥ ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2024.

➥ ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024.

➥ తుది ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి/ మార్చి 2024.

ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2023, అక్టోబరు మొదటివారం నుంచి.

ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహణ: 2023, అక్టోబరు రెండోవారం నుంచి.

Notification

Online Application

Website

ALSO READ:

కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget