By: ABP Desam | Updated at : 22 Sep 2023 08:48 PM (IST)
Edited By: omeprakash
ఈసీఐఎల్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్ 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 484.
సీట్ల కేటాయింపు: జనరల్-243, ఈడబ్ల్యూఎస్-24, ఓబీసీ-131, ఎస్సీ-73, ఎస్టీ-37.
విభాగాల వారీగా ఖాళీలు..
➥ ఈఎం- 190
➥ ఎలక్ట్రీషియన్- 80
➥ ఫిట్టర్- 80
➥ ఆర్ & ఏసీ- 20
➥ టర్నర్- 20
➥ మెషినిస్ట్- 15
➥ మెషినిస్ట్(జి)- 10
➥ సీవోపీఏ- 40
➥ వెల్డర్- 25
➥ పెయింటర్- 4
వయోపరిమితి: 31.10.2023 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
శిక్షణ కాలం: ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే వేదిక:
ELECTRONICS CORPORATION OF INDIA LIMITED,
Corporate Learning & Development Centre (CLDC),
Nalanda Complex, TIFR Road, ECIL,
Hyderabad – 500 062. Phone NO. 04027186454
ముఖ్య తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ప్రారంభం: 25.09.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.10.2023.
➥ ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 16.10.2023 నుంచి 21.10.2023 వరకు.
➥ ప్రవేశానికి గడువు తేదీ: 31.10.2023
➥ అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రారంభం: 01.11.2023.
ALSO READ:
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ అర్హతతో 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్, ఏడాదికి రూ.6.50 లక్షల జీతం
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఈ పోస్టులను ఐడీబీఐ భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) ఉద్యోగం లభిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
NCDC: ఎన్‌సీడీసీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు, వివరాలు ఇలా
AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు
ECIL Apprenticeship: ఈసీఐఎల్‌లో 363 గ్రాడ్యుయేట్ & డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు
TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
/body>