అన్వేషించండి

RRB Exam Result: అసిస్టెంట్ లోకో పైలట్‌ స్టేజ్-1 ఫలితాలు విడుదల, కటాఫ్ మార్కుల వివరాలు ఇలా

RRB ALP: అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి నిర్వహించిన స్టేజ్-1 రాతపరీక్ష ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

RRB ALP Stage-1 Results 2024: రైల్వేశాఖ అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల (స్టేజ్-1) ఫలితాలను ఫిబ్రవరి 26న విడుదల చేసింది. రీజియన్లవారీగా అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలతోపాటు పరీక్షకు సంబంధించిన కటాఫ్‌ మార్కులను కూడా రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులకు మార్చి 19, 20 తేదీల్లో స్టేజ్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన సెంటర్‌ వివరాలు పరీక్షకు 10 రోజులు ముందుగా, అడ్మిట్‌ కార్డులను నాలుగు రోజుల ముందు నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

సికింద్రాబాద్ జోన్ పరిధి ఫలితాల కోసం క్లిక్ చేయండి..

కటాఫ్ మార్కుల వివరాలు ఇలా..

కేటగిరీ  కటాఫ్ మార్కులు
యూఆర్ 56.20216 
ఎస్సీ 38.27358 
ఎస్టీ 32.32200 
ఓబీసీ 43.81067 
ఈడబ్ల్యూఎస్ 40.09009 
ఎక్స్-సర్వీస్‌మెన్ 30.42793

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల సంఖ్యను మూడింతలు పెంచింది. దీంతో 5,696గా ఉన్న ఏఎల్‌పీ పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు  ప్రాధామ్యాల (Preferences) నమోదుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగార్థులకు వయోపరిమితిని 30 నుంచి 33కి పెంచిన సంగతి తెలిసిందే. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.

స్టేజ్-2 పరీక్ష విధానం..
మొత్తం 175 మార్కులకు స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 175 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 150 నిమిషాలు. ఇందులో పేపర్-1 నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, బేసిక్ సైన్స్ & ఇంజినీరింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇక పేపర్-2 నుంచి సంబంధింత ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పేపర-2 పరీక్ష సమయం 60 నిమిషాలు.  

పోస్టుల వివరాలు ఇలా...

రైల్వే జోన్ ప్రకటించిన ఖాళీలు పెరిగిన ఖాళీల సంఖ్య
సెంట్రల్ రైల్వే 535 1786
 ఈస్ట్ సెంట్రల్ రైల్వే 76  76
ఈస్ట్ కోస్ట్ రైల్వే   479 1595
ఈస్టర్న్ రైల్వే 415 1382
నార్త్ సెంట్రల్ రైల్వే 241 802
నార్త్ ఈస్టర్న్ రైల్వే   43 143
నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే    129 428
నార్తర్న్ రైల్వే 150 499
నార్త్ వెస్టర్న్ రైల్వే 228 761
సౌత్ సెంట్రల్ రైల్వే 585 1949
సౌత్-ఈస్త్ సెంట్రల్ రైల్వే 1192 3973
సౌత్ ఈస్టర్న్ రైల్వే   300 1001
సదరన్ రైల్వే   218 726
సౌత్ వెస్టర్న్ రైల్వే   473 1576
వెస్ట్ సెంట్రల్ రైల్వే  219  729
వెస్ట్రర్న్ రైల్వే 413  1376
మొత్తం ఖాళీలు 5,696 18,799

Notification

Website

Also Read: సీఐఎస్‌ఎఫ్‌లో 1161 కానిస్టేబుల్ పోస్టులు - టెన్త్ అర్హత చాలు

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Gadwal Crime News: గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
Dhurandhar Record Collections : బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Gadwal Crime News: గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్
Dhurandhar Record Collections : బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
2026 లో ఈ 3 రాశుల మహిళల వల్ల వారి భర్త అదృష్టం మారుతుంది!
2026 లో ఈ 3 రాశుల మహిళల వల్ల వారి భర్త అదృష్టం మారుతుంది!
Weakest Currency : ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఈ దేశానిదే.. ఇక్కడ పదివేలు అక్కడ నలభై లక్షలు పైమాటే
ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఈ దేశానిదే.. ఇక్కడ పదివేలు అక్కడ నలభై లక్షలు పైమాటే
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Embed widget