అన్వేషించండి

RBI Recruitment 2022: ఆర్‌బీఐలో అసిస్టెంట్ పోస్టులు - ఫీజు వివరాలు, ముఖ్యమైన తేదీలు ఇవే

RBI Assistant 2022 Notification: ఆన్‌లైన్‌ (సీబీటీ) టెస్ట్, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు. 

RBI Recruitment 2022: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ (RBI Assistant Recruitment 2022) విడుదల చేసింది. ఇదివరకే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, మార్చి 8వ తేదీతో దరఖాస్తులకు తుది గడువు ముగియనుంది. ఇదే నెల చివర్లో పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ (సీబీటీ) టెస్ట్, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు. 

మొత్తం 950 అసిస్టెంట్ పోస్టులకు రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ ఇచ్చింది. ముంబయి ప్రధాన కేంద్రంగా నడిచే ఆర్బీఐ ఈ పోస్టులను త్వరగానే భర్తీ చేసి నియామకాలు చేపట్టనుంది. రెండు దశల అర్హత పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. అభ్యర్థులు 20 నుంచి 28 ఏళ్ల వయసు వారై ఉండాలి. కనీస విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీ ఉంటేనే అర్హులుగా పరిగణిస్తారు. పూర్తి వివరాలు మీకోసం..

ఆర్బీఐ అసిస్టెంట్ ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు తుది గడువు : మార్చి 8, 2022
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : మార్చి 26, 27 
ఆన్‌లైన్ మెయిన్ టెస్ట్ : మే 2022

ఆర్బీఐ అసిస్టెంట్ ఫీజు వివరాలు..
ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరి వారికి రూ.50
జనరల్, ఓబీసీ, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులకు Examination fees+ Intimation Charges కలిపి రూ.450 చెల్లించాలి
ఇదివరకే ఆర్బీఐ లో జాబ్ చేస్తున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు
పరీక్ష ఫీజు, దరఖాస్తు ఫీజు చెల్లింపులకు గానూ ప్రాసెసింగ్ ఫీజును అభ్యర్థి చెల్లించాలి.   పూర్తి వివరాలకు RBI website  www.rbi.org.in. ను సందర్శించాలి.

జీతం నెలకు రూ. 20,700 

ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టులకు క్వాలిఫికేషన్: 
1) SC/ST/PwBD అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 
2) ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లేకపోతే మెట్రిక్యులేషన్ or సాయుధ దళాలకు సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. కనీసం 15 సంవత్సరాలు సర్వీస్ అందించి ఉంటే అర్హులు 
3)  అభ్యర్థులు రాష్ట్రం/ రిక్రూటింగ్ ఆఫీస్ పరిధిలోకి వచ్చే ఏదైనా రాష్ట్రంలోని భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం మరియు అర్థం చేసుకోగలగాలి 

Also Read: Indian Navy Recruitment 2022: పదో తరగతి అర్హతతో నేవీలో ఉద్యోగాలు, 1531 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

వీడియోలు

Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Embed widget