RRB Exam: అసిస్టెంట్ లోకో పైలట్ స్టేజ్-2 అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
RRB ALP Exam: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్‌పీ) కంప్యూటర్ ఆధారిత పరీక్షల (స్టేజ్-2) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.

RRB ALP CBT 2 Admit cards 2025: రైల్వేశాఖ అసిస్టెంట్ లోకో పైలట్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల (స్టేజ్-2) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులకు మార్చి 19, 20 తేదీల్లో స్టేజ్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. స్టేజ్-2 పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను పొందవచ్చు. పరీక్షకు సంబంధించిన సెంటర్ వివరాలు పరీక్షకు 10 రోజులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. రైల్వేశాఖ అసిస్టెంట్ లోకో పైలట్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల (స్టేజ్-1) ఫలితాలను, కట్‌ఆఫ్ మార్కులను ఫిబ్రవరి 26న విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్టేజ్- 1 పరీక్ష రాసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయగా మొత్తం 1,251 మంది స్టేజ్-2 పరీక్షకు ఎంపికయ్యారు.
Download RRB ALP CBT 2 Admit Card
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల సంఖ్యను మూడింతలు పెంచింది. దీంతో 5,696గా ఉన్న ఏఎల్‌పీ పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాధామ్యాల (Preferences) నమోదుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగార్థులకు వయోపరిమితిని 30 నుంచి 33కి పెంచిన సంగతి తెలిసిందే. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.
స్టేజ్-2 పరీక్ష విధానం..
మొత్తం 175 మార్కులకు స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 175 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 150 నిమిషాలు. ఇందులో పేపర్-1 నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, బేసిక్ సైన్స్ & ఇంజినీరింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇక పేపర్-2 నుంచి సంబంధింత ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పేపర-2 పరీక్ష సమయం 60 నిమిషాలు.
పోస్టుల వివరాలు ఇలా...
రైల్వే జోన్ | ప్రకటించిన ఖాళీలు | పెరిగిన ఖాళీల సంఖ్య |
సెంట్రల్ రైల్వే | 535 | 1786 |
ఈస్ట్ సెంట్రల్ రైల్వే | 76 | 76 |
ఈస్ట్ కోస్ట్ రైల్వే | 479 | 1595 |
ఈస్టర్న్ రైల్వే | 415 | 1382 |
నార్త్ సెంట్రల్ రైల్వే | 241 | 802 |
నార్త్ ఈస్టర్న్ రైల్వే | 43 | 143 |
నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే | 129 | 428 |
నార్తర్న్ రైల్వే | 150 | 499 |
నార్త్ వెస్టర్న్ రైల్వే | 228 | 761 |
సౌత్ సెంట్రల్ రైల్వే | 585 | 1949 |
సౌత్-ఈస్త్ సెంట్రల్ రైల్వే | 1192 | 3973 |
సౌత్ ఈస్టర్న్ రైల్వే | 300 | 1001 |
సదరన్ రైల్వే | 218 | 726 |
సౌత్ వెస్టర్న్ రైల్వే | 473 | 1576 |
వెస్ట్ సెంట్రల్ రైల్వే | 219 | 729 |
వెస్ట్రర్న్ రైల్వే | 413 | 1376 |
మొత్తం ఖాళీలు | 5,696 | 18,799 |
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

