Working Hours: వారానికి 90 గంటల పని - మనుషుల్ని టెక్ బానిసలుగా చేసే ప్లాన్ - కార్పొరేట్ బాసులు తెగిస్తున్నారా ?
Corporate Slave: ఉద్యోగుల పని గంటలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అత్యధిక మంది విశ్రాంతి లేకుండా పని చేయడానికి యంత్రాలా .. మనుషులా అని ప్రస్నిస్తున్నారు.

Nationwide debate on the working hours of employees: రోజుకు ఎనిమిది గంటలు.. వారానికి ఆరు రోజుల పని భారత దేశంలో ప్రామాణిక సమయం. ఓ మనిషి శారీరకంగా, మానసికంగా పని చేయడానికి.. తర్వాత కుటుంబానికి , విశ్రాంతికి సమయం కేటాయించడానికి ఇంత కన్నా ఎక్కువ పని చేయడం శ్రేయస్కరం కాదని నిర్దారించారు. ప్రపంచంలో చాలా దేశాలు.. రోజుకు తొమ్మిది గంటలు వారానికి ఐదు రోజులు పని పద్దతిని పాటిస్తున్నాయి. టెక్ ప్రపంచం విస్తరించిన తర్వాత భారత్ లోనూ ఆ విధానం పెరుగుతోంది. ఇప్పటికే పని గంటలతో పని లేకుండా పని చేయించుకుంటున్నారని.. చాలా కంపెనీలపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేట్ బాసులు.. అసలు కుటుంబాలు ఎందుకు పని చేస్తేచాలు కదా అంటున్నారు.
మొదట ఇన్ఫోసిస్ తర్వాత ఎల్ అండ్ టీ బాసులు !
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కొన్నాళ్ల కిందట యువత వారానికి 70 గంటలు పని చేయాలని సలహా ిచ్చారు. అంటే విశ్రాంతి తీసుకోకుండా వారానికి ఏడు రోజులు రోజుకు పది గంటలు పని చేయాలి. ఒక రోజు సెలవు తీసుకోవాలనుకుంటే.. ఆరు రోజుల పాటు రోజుకు పదకొండున్నర గంటలు పని చేయాలని చేయాలని చెప్పుకొచ్చారు. నారాయణమూర్తికి వయసు పెరిగిపోయిందని చాదస్తంగా మాట్లాడుతున్నారని చాలా మంది లైట్ తీసుకున్నారు. అయితే ఆయన మాత్రం తన విధానాన్ని మార్చుకునేది లేదన్నారు. తాజాగా నారాయణమూర్తి కంటే ఎక్కువగా వారానికి 90 గంటలు పని చేయాలని.. ఇంట్లో బార్యముఖాలు ఎంత సేపు చూస్తారని ఎల్ అండ్ టీ చైర్మన్ వాక్రూచ్చారు. ఆయన మాటల్ని ఎల్ అండ్ టీకూడా సమర్థించుకుంది. కొంత మంది వీరి మాటలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. కానీ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.
90 గంటల పాటు పని బానిస మనస్థత్వమన్న ఆరోపణలు
రోజుకు ఇరవై నాలు గంటలు అంటే.. ఏడు రోజులకు 168 గంటలు. ఇందులో 90 గంటల పాటు పని చేస్తే ఇక మిగిలేది 78 గంటలు. ఓ మనిషికి కనీసం ఆరేడు గంటల నిద్ర చాలా అవసరమని వైద్యులు ప్రకటించారు. లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే కనీసం యభై గంటలు నిద్రకు తీసేయాలి. ఇక మిగిలే 28 గంటల్లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి, తినడానికి స్నానం చేయడానికి.. రోజుకు కనీసం గంట పాటు కేటాయించుకున్నా.. ఇక మిగిలేది ఇరవై గంటలు. ఇందులోనే వ్యక్తిగత పనులు.. కుటుంబ అవసరాలు.. అన్నీ చూసుకోవాలి. అంటే రోజుకు మూడు గంటలు మాత్రమే ఉంటుంది. కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఒక్క సినిమా చూసేందుకు కూడా టైమ్ ఉండదన్నమాట. ఉదయం ఆరు గంటలకు లాగిన్ అయితే..రాత్రి ఏడు గంటల వరకూ పని చేయాలని చెబుతున్నారు. అది కూడా ఏడు రోజులు. ఇంత కన్నా బానిసత్వం ఏమీ ఉండదని ఎవరైనా అనిపిస్తుంది.
ఇప్పటికే పని గంటలు తగ్గించాలన్న సూచనలు
ఇప్పటికే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా యువతలో మానసికపరమైన సమస్యలు పెరుగుతున్నాయి. అంత కంటే మించి కెరీర్ తో పాటు కుటుంబానికి.. జీవితాన్ని ఆస్వాదించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సొంత కంపెనీలు పెట్టుకున్నా సరే పర్సనల్ లైఫ్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో టెక్ కంపెనీల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణం.. ఉద్యోగుల ఔట్ పుట్ తగ్గిపోతోందని.. వారికి తగినంత విశ్రాంతి ఇవ్వాలన్న రిపోర్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా దేశ యువతను వారానికి 90 గంటలు పని చేయించుకుంటే.. ఇండియా ఉత్పాదకత పెరగదని..మ్యాన్ పవర్ మొత్తం నిర్వీర్యం అయిపోతుందని అంటున్నారు. నారాయణూర్తి ప్రారంభించిన డిబేట్ ను సుబ్రహ్మణ్యన్ పీక్ కు తీసుకెళ్లారు. ఇ్పపుడు డిబేట్ విపరీతంగా జరుగుతుంది. చివరికి ఏమైనా మార్పులు జరుగుతాయా లేదా అన్ని వేచి చూడాల్సి ఉంది.
Also Read: ఎల్ అండ్ టీ చైర్మన్ కన్నా ఇన్ఫోసిస్ పెద్దాయనే నయం - వారానికి 90 గంటలు పని చేయాలట !





















