అన్వేషించండి

Viral New : ఎల్‌ అండ్ టీ చైర్మన్ కన్నా ఇన్ఫోసిస్ పెద్దాయనే నయం - వారానికి 90 గంటలు పని చేయాలట !

Weekly Hours: యువత వారానికి 90 గంటలు పని చేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ సలహా ఇస్తున్నారు. అంటే ఆదివారాలు కూడా పని చేయమంటున్నారు.

L And T Chairman Subrahmanyans comments that youth should work 90 hours a week: రోజుకు ఎనిమిది గంటల డ్యూటీ, వారానికి ఆరు రోజులు పని చేస్తే మనిషి అలసిపోతాడు. అయితే కార్పొరేట్ పెద్దలు మాత్రం ఇంకా ఇంత బద్దకంగా ఎలా ఉంటారని  ప్రశ్నిస్తున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణనూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని కామెంట్ చేసి చాలా రోజులు అయింది. దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చాలా మంది అలా ఎలా సాధ్యమవుతందని ఇక కుటుంబాలు లేకుండా ఆయా కంపెనీలకు వెట్టి చాకిరి చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. పెద్దాయనకు చాదస్తం అని చాలా మంది లైట్ తీసుకున్నారు. 

ఇప్పుడు లార్సన్ అండ్ టూబ్రో చైర్మన్ సుబ్రహ్మణ్యన్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇంకా చెప్పాలంటే ఇన్ఫోసిస్ ఫౌండరే చాలా దయార్ద్ర హృదయుడు అనుకునేలా చేశారు. యువత వారానికి 90  గంటలు పని చేయాలని సుబ్రమణియన్ సలహా ఇస్తున్నారు. ఇంట్లో భార్య ముఖం ఎంత కాలం చూస్తారని ఆయన అంటున్నారు. రోజుకు పదమడు గంటల పాటు .. ఆదివారాలు కూడా పని చేస్తే మన దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుందని ఆయన సలహా ఇస్తున్నారు.  ఇంట్లో తక్కువ సమయం.. ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలని ఆయన సలహా ఇస్తున్నారు. 

అంతే కాదు ఆదివారాలు మీతో పని చేయించలేకపోతున్నందుకు బాధపడుతున్నాని తన కంపెనీ ఉద్యోగులకు చెప్పారు. తాను ఆదివారాలు కూడా పని చేస్తున్నానని మీతో ఆ పని చేయించలేకపోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. సుబ్రమణియన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఉద్యోగుల్ని కంపెనీల్లోనే ఉంచేసుకుని వారు నిద్రపోవడానికి తిండి తినడానికి సమయం ఇస్తే అక్కడే పడి ఉంటారని సలహాలు కూాడా ఇస్తున్నారు. పూర్వకాలంలో బానిసలు ఉండేవారని.. ఇప్పుడు అలాగే చేద్దామని అనుకుంటున్నారు. 

నిజానికి చాలా మంది కార్పొరేట్ ప్రముఖులు.. ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారు శని, ఆదివారాలు తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలూ పని చేస్తంటారు. సమయం దొరికినప్పుడే తిని, నిద్రపోతూంటారు. కుటుంబాలను కూడా పెద్దగా పట్టించుకోరు. మిగతా ఉద్యోగులుకూడా అలాగే పని చేయాలని ఈ ఎగ్జిక్యూటివ్ లు కోరుకుంటున్నారు. అలా అయితనే మన దేశ ఉత్పాదకత పెరుగుతుందని వారంటున్నారు. ఇలాంటి డిమాండ్లు పెరిగిపోతే రాను రాను ఉద్యోగుల పని గంటలు పెంచాలన్న డిమాండ్లు వచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.   

Also Read: ఒరే ఆజాము ఎంత గ్యాంగ్‌స్టర్‌వి అయితే మాత్రం గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే రోజు ఇలా చేయాలా ? - అదిత్యనాథ్ ఒక చూపు చూస్తే ...

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Sahara Desert Tragedy: సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Tech Layoffs: 2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
Sahara Desert Tragedy: సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
Embed widget