NARFBR: ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్ హైదరాబాద్‌లో 46 ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, అర్హతలివే!
ఐసీఎంఆర్- నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్(ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ల్యాబ్ అటెండెంట్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్- నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్(ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-1, ల్యాబ్ అటెండెంట్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 14 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
టెక్నికల్ అసిస్టెంట్: 03
టెక్నీషియన్-1: 08
ల్యాబ్ అటెండెంట్-1: 35
అర్హతలు: పోస్టులని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయో పరిమితి: టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 సంవత్సరాలు; టెక్నీషియన్‌కు 28 సంవత్సరాలు; ల్యాబ్ అటెండెంట్‌కు 25 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
చిరునామా: Director, ICMR – National Animal Resource Facility for
Biomedical Research, Genome Valley, Kolthur (P.O), Shamirpet (M),
Hyderabad, Telangana – 500 101
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 14.08.2023.
ALSO READ:
డిగ్రీ కాలేజీల్లో 2,858 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు, వివరాలు ఇలా!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఖాళీల భర్తీకి జులై 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నారు. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 527 మంది లెక్చరర్ పోస్టులను, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 341 పోస్టులను, హోనరేరియం కింద 50 టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా 1,940 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ పోస్టుల కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial