అన్వేషించండి

Staff Nurse Exam: స్టాఫ్‌నర్స్‌ అభ్యర్థులకు అందుబాటులో మాక్‌టెస్ట్, ఇలా ప్రాక్టీస్ చేయండి!

తెలంగాణలో రాష్ట్రంలో స్టాఫ్‌నర్స్‌ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) అవకాశం కల్పించింది.

తెలంగాణలో రాష్ట్రంలో స్టాఫ్‌నర్స్‌ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) అవకాశం కల్పించింది. మొదటిసారి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అభ్యర్థుల అవగాహన కోసం ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్ రాయవచ్చని తెలిపింది. రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని ఆగస్టు 2న నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాలుగా పరీక్షలు నిర్వహించనున్నారు. 

మాక్ టెస్ట్ ఇలా రాయండి..

➥ పరీక్ష రాయాలనుకునేవారు మొదట MHSRB అధికారిక వెబ్‌‌సైట్‌లోకి వెళ్లాలి.

➥ అక్కడ హోంపేజీలో కనిపించే ''Click here for staff nurse examination mock test'' లింక్ మీద క్లిక్ చేయాలి.

➥ క్లిక్ చేయగానే మాక్ టెస్టుకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతోంది.

➥ పరీక్షలో అయితే లాగిన్ వివరాలు నమోదుచేయాలి. మాక్ టెస్టు కాబట్టి నేరుగా ''Sign In'' బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.

➥ మాక్ టెస్ట్ పరీక్ష నిబంధనలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. 

➥ ఇచ్చిన నిబంధనలను జాగ్రత్తగా చదివి కింద ఇచ్చిన బాక్సులో టిక్ చేయాలి.

➥ తర్వాత 'I am ready to begin' బటన్ మీద క్లిక్ చేసి ముందుకు వెళ్లడానికి 'OK' క్లిక్ చేయాలి.    

➥ ఇక పరీక్ష కొనసాగించవచ్చు.

మాక్ టెస్ట్ కోసం క్లిక్ చేయండి..

వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 30 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంఈ, డీహెచ్  పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్  వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.

రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. తప్పుగా ఇచ్చిన జవాబులకి నెగెటివ్ మార్కులు ఉండవు.

నోటిఫికేషన్, రాతపరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

పెరిగిన స్టాఫ్ నర్స్ పోస్టులు, 7 వేలకి చేరిన ఖాళీల సంఖ్య, కొత్త నోటిఫికేషన్ నట్లేనా?
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో మరో 1,827 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా వైద్యవిద్య సంచాలకుల పరిధిలోనివే. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ జూన్ 23న ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు భర్తీ చేయనుంది. ఇప్పటికే 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు నిరుడు డిసెంబరు 30 మెడికల్‌ బోర్డ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందుకు సంబంధించి రాత పరీక్ష ఈ ఏడాది ఆగస్టు 2న నిర్వహించబోతున్నారు. ఈ లోగానే మరో 1,827 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Travis Head: అలా ఎలా  కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
Viral News: సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
Embed widget