అన్వేషించండి

వైద్యారోగ్యశాఖలో 5,204 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌! జనవరి 25 నుంచి దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?

వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎంఈ, డీహెచ్  పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు ఉన్నాయి.

తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (డిసెంబరు 30) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డీఎంఈ, డీహెచ్  పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్  వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 25 నుంచి ఫిభ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ మెడికల్‌హెల్త్ సర్వీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.

పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 5,204 పోస్టులు

1) స్టాఫ్ నర్స్: 3,823 పోస్టులు
విభాగం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.

2) స్టాఫ్ నర్స్: 757 పోస్టులు
విభాగం: తెలంగాణ వైద్యవిధాన పరిషత్. 

3) స్టాఫ్ నర్స్: 81 పోస్టులు
విభాగం: ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్.

4) స్టాఫ్ నర్స్: 08 పోస్టులు
విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజెబుల్డ్ అండ్ సీనియర్ సిటీజెన్స్ వెల్ఫేర్.

5) స్టాఫ్ నర్స్: 127 పోస్టులు
విభాగం: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.

6) స్టాఫ్ నర్స్: 197 పోస్టులు
విభాగం: మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.

7) స్టాఫ్ నర్స్: 74 పోస్టులు
విభాగం: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం).

8) స్టాఫ్ నర్స్: 124 పోస్టులు
విభాగం: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.

9) స్టాఫ్ నర్స్: 13 పోస్టులు
విభాగం: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.

అర్హత: జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (GNM) లేదా బీఎస్సీ (నర్సంగ్). తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి. సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
                         వైద్యారోగ్యశాఖలో 5,204 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌! జనవరి 25 నుంచి దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?

దరఖాస్తు/పరీక్ష ఫీజు: రూ.620. ఇందులో రూ.500 పరీక్ష ఫీజు, రూ.120 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, నిరుద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.02.2023. (5 P.M.)

Website

Also Read:

తెలంగాణలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, జీతమెంతో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ & బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హార్టికల్చర్ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Gemini and ChatGPT Pro Plans Free: ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Psych Siddhartha OTT: సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Happy News Year 2026: 2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
Embed widget