IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు
Intelligence Bureau Notification: ఐబీ దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 995 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 15లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
వివరాలు..
► అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్: 995 పోస్టులు
ఖాళీల సంఖ్య: 995
పోస్టుల కేటాయింపు: యూఆర్- 377, ఈడబ్ల్యూఎస్- 129, ఓబీసీ- 222, ఎస్సీ- 134, ఎస్టీ- 133.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 15.12.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.450. అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులు అదనంగా రూ.100 కలిపి మొత్తం రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్, SBI చలానా రూపంలో ఫీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: టైర్-1 రాత పరీక్ష, టైర్-2 పరీక్ష, టైర్-3/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం..
➥ టైర్-1 రాత పరీక్ష ఆబ్జెక్టివ్, టైర్-2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది.
➥ టైర్-1 పరీక్షలో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్/ లాజికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
➥ టైర్-2 పరీక్షలో ఎస్సే, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ప్రెసిస్ రైటింగ్ ఉంటుంది. 50 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు(గంట).
➥ ఇక 100 మార్కులతో టైర్-3/ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.
పే స్కేల్: నెలకు రూ.44,900-1,42,400.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభం: 25.11.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.12.2023.
➥ దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 19.12.2023.
Notification:
ALSO READ:
ఐడీబీఐ బ్యాంకులో 2,100 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
IDBI Recruitment: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI Bank) ఒప్పంద ప్రాతిపదికన 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ (JAM, Executive) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 06 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply