అన్వేషించండి

IDBI: ఐడీబీఐ బ్యాంకులో 2,100 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

IDBI Recruitment: ఐడీబీఐ బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదికన 2023 - 24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ (JAM, Executive) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

IDBI Recruitment: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI Bank) ఒప్పంద ప్రాతిపదికన 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ (JAM, Executive) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 06 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.   

వివరాలు..

➥ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ ‘ఒ’: 800 

పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 120, ఎస్టీ- 60, ఓబీసీ- 216, ఈడబ్ల్యూఎస్‌- 80, యూఆర్‌- 324.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 

➥ ఎగ్జిక్యూటివ్‌- సేల్స్ అండ్ ఆపరేషన్స్(ఈఎస్‌వో): 1300 

పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 200, ఎస్టీ- 86, ఓబీసీ- 326, ఈడబ్ల్యూఎస్‌- 130, యూఆర్‌- 558.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. కేవలం డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించడం అర్హత ప్రమాణాలకు అర్హతగా పరిగణించబడదు.

వయోపరిమితి: 01.11.2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల ప్రభావితులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.

జీత భత్యాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు ఏడాదికి రూ.6.14 - రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలకు నెలకు రూ.29,000- రూ.31,000.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ - 60 ప్రశ్నలు- 60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వే్జ్- 40 ప్రశ్నలు- 40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 40 ప్రశ్నలు- 40 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్/కంప్యూటర్ /ఐటీ - 60 ప్రశ్నలు- 60 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు (రెండు గంటలు). పరీక్షలో ఇంగ్లిష్ విభాగం మినహా.. మిగతా అన్ని విభాగాలకు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 

ఇంటర్వ్యూ విధానం: మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఇందులో కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22.11.2023

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.12.2023.

➥ ఆన్‌లైన్ పరీక్షతేదీలు..

* జేఏఎం పోస్టులకు 31.12.2023.

* ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 30.12.2023.

Notification

Application

Website

ALSO READ:

ఎస్‌బీఐలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా

➥ ఎస్‌బీఐ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల, డిగ్రీ అర్హతతో 8773 పోస్టుల భర్తీ

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGSRTC Ticket Price Hike: సంక్రాంతికి స్పెష‌ల్ బ‌స్సుల టికెట్ ధ‌ర‌ల పెంపుపై తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన
సంక్రాంతికి స్పెష‌ల్ బ‌స్సుల టికెట్ ధ‌ర‌ల పెంపుపై తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన
Hottest Year: భూమిపై సూర్యుని ప్రతాపం, అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్ - నాసా హెచ్చరిక
భూమిపై సూర్యుని ప్రతాపం, అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్ - భవిష్యత్తులో ప్రమాదం తప్పదంటోన్న శాస్త్రవేత్తలు
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Pawan Kalyan:  పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGSRTC Ticket Price Hike: సంక్రాంతికి స్పెష‌ల్ బ‌స్సుల టికెట్ ధ‌ర‌ల పెంపుపై తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన
సంక్రాంతికి స్పెష‌ల్ బ‌స్సుల టికెట్ ధ‌ర‌ల పెంపుపై తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన
Hottest Year: భూమిపై సూర్యుని ప్రతాపం, అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్ - నాసా హెచ్చరిక
భూమిపై సూర్యుని ప్రతాపం, అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్ - భవిష్యత్తులో ప్రమాదం తప్పదంటోన్న శాస్త్రవేత్తలు
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Pawan Kalyan:  పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
Game Changer Box Office Collection Day 1 : రామ్ చరణ్ కెరీర్​లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
రామ్ చరణ్ కెరీర్​లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
JC Prabhakar Reddy: నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి 
నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి 
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం, కీలక సూచనలివే
Daaku Maharaaj: తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
Embed widget