By: ABP Desam | Updated at : 18 Mar 2023 11:22 AM (IST)
Edited By: omeprakash
అగ్నివీర్ వాయు దరఖాస్తు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా 'అగ్నివీర్ వాయు' నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి మార్చి 17న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్న అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
* ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)- అగ్నిపథ్ స్కీం అగ్నివీర్ వాయు(02/ 2023) నియామకాలు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ ఇంటర్మీడియట్(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 26.12.2002 నుంచి 26.06.2006 మధ్య జన్మించి ఉండాలి.
ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష ఫీజు: రూ.250.
ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:17.03.2023.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 31.03.2023.
➥ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 20.05.2023.
Also Read:
సీఆర్‌పీఎఫ్‌లో 9212 కానిస్టేబుల్ పోస్టులు, టెన్త్ అర్హతతో నెలకు రూ.69,100 వరకు జీతం!
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ విభాగాల్లో మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 424, తెలంగాణలో 301 ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్న పురుష/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి, వివరాలు ఇలా!
TS Police SI Admit Card: ఎస్‌సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే
IITTM Jobs: ఐఐటీటీఎం- టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్ లీకేజీకి స్కెచ్!
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్ థింగ్ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల
UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్!
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు