By: ABP Desam | Updated at : 20 Nov 2023 11:12 PM (IST)
Edited By: omeprakash
శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఉద్యోగాలు ( Image Source : svmc )
HMFW Tirupati Recruitment: తిరుపతిలో ఏపీ కుటుంబ, వైద్యారోగ్య సంక్షేమశాఖ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (SVMC) కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ (Contract Jobs) ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీడీసీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 26
➥ ఎలక్ట్రీషియన్/ మెకానిక్: 01
అర్హత: ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత విభాగాలలో డిప్లొమా లేదా ఐటీఐ కలిగి ఉండాలి.
వేతనం: రూ.22,460.
➥ ల్యాబ్ అటెండెంట్: 07
అర్హత: ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్(ల్యాబ్ అటెండెంట్ వోకేషనల్ కోర్సు) కలిగి ఉండాలి.
వేతనం: రూ.15,000.
➥ ఆఫీస్ సబార్డినేట్: 06
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వేతనం: రూ.15,000.
➥ మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 03
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్‌లో క్వాలిఫై ఐన మేల్ అభ్యర్థులు అర్హులు.
వేతనం: రూ.15,000.
➥ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 04
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్‌లో క్వాలిఫై ఐన ఫిమేల్ అభ్యర్థులు అర్హులు.
వేతనం: రూ.15,000.
➥ మార్చురీ మెకానిక్: 01
అర్హత: ఎల్‌ఎంఈ(డిప్లొమా) కలిగి ఉండాలి.
వేతనం: రూ.18,000.
➥ డేటా ఎంట్రీ ఆపరేటర్: 03
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మరియి ఒక సంవత్సరం పీజీడీసీఏ కోర్సు లేదా బీకామ్(కంప్యూటర్స్), బీఎస్సీ(కంప్యూటర్స్), బీటెక్(కంప్యూటర్స్) కలిగి ఉండాలి.
వేతనం: రూ.18,500.
➥ జనరల్ డ్యూటీ అటెండెంట్: 01
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వేతనం: రూ.15,000.
వయోపరిమితి: 1.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, విభిన్న సామర్థ్యం గల అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపించాలి.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
దరఖాస్తుకు చివరితేది: 28.11.2023.
Also Read:
➥ పల్నాడు జిల్లాలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులు, అర్హతలివే
➥ గుంటూరు జిల్లా మహిళా, శిశు సంక్షేమ విభాగంలో కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
ECIL Apprenticeship: ఈసీఐఎల్‌లో 363 గ్రాడ్యుయేట్ & డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు
TSPSC Group 4 Results: టీఎస్పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?
ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?
NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
/body>