By: ABP Desam | Updated at : 28 Jul 2023 05:18 PM (IST)
Edited By: omeprakash
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
కర్ణాటకలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 45 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 09వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 45
* సీనియర్ రెసిడెంట్ పోస్టులు
⏩ అనాటమీ: 03
⏩ ఫిజియాలజీ: 03
⏩ బయోకెమిస్ట్రీ: 04
⏩ ఫార్మకాలజీ: 02
⏩ పాథాలజీ: 03
⏩ మైక్రోబయాలజీ: 03
⏩ ఫోరెన్సిక్ మెడిసిన్: 02
⏩ కమ్యూనిటీ మెడిసిన్: 01
⏩ జనరల్ మెడిసిన్: 02
⏩ టీబీ & చెస్ట్: 01
⏩ డెర్మటాలజీ: 01
⏩ సైకియాట్రీ: 01
⏩ జనరల్ సర్జరీ
⏩ రేడియో నిర్ధారణ: 04
⏩ ఐసీయూ/ఎంఐసీయూ(మెడ్)& ఐసీసీయూ(మెడ్): 05
⏩ ఎమర్జెన్సీ మెడిసిన్: 07
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 44 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు రూ.121048 చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: ESIC Medical College and Hospital, Kalaburagi.
ఇంటర్వ్యూ తేది: 09.08.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9-10:30 వరకు.
Also Read:
తెలంగాణలో 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు, మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
ముంబయిలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌ఐఏసీఎల్) దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్ శాఖల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్-1) పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకి ఆగస్టు1వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు
PGCIL: పీజీసీఐఎల్లో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
SSC CHSL 2023 Result: ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 'టైర్-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక
VCRC Recruitment: వీసీఆర్సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!
ICMR: ఐసీఎంఆర్-ఎన్ఐఆర్టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలు
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
World Cup 2023: హైదరాబాద్‌లో పాక్xకివీస్ వార్మప్ మ్యాచ్! వర్షం కురిసే ఛాన్స్!
Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!
ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్ - సరిహద్దుల్లో భారీ భద్రత
/body>