ESIC: ఈఎస్ఐసీ అల్వార్‌లో 115 ఉద్యోగాలు, ఎంపికైతే భాారీగా జీతం
ESIC Jobs: రాజస్థాన్, అల్వార్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) అండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ESIC News Updates: రాజస్థాన్, అల్వార్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) అండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 115
1. ప్రొఫెసర్: 09 పోస్టులు
అర్హత: ఎన్‌ఎంసీ/ఎంఐసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 67 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.2,01,213.
2. అసోసియేట్ ప్రొఫెసర్: 21 పోస్టులు
అర్హత: ఎన్‌ఎంసీ/ఎంఐసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 67 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.1,338,02.
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 30 పోస్టులు
అర్హత: ఎన్‌ఎంసీ/ఎంఐసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 67 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.1,14,955.
4. సీనియర్ రెసిడెంట్: 34 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.67,700.
5. సీనియర్ రెసిడెంట్ (జీడీఎంవో): 12 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: రూ.67,700.
6. సూపర్ స్పెషలిస్ట్: 09 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 67 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: ఫుల్‌టైమ్ ఎంట్రీ లెవెల్ రూ.2,00,000; సీనియర్ లెవెల్ రూ.2,40,000. పార్ట్‌టైమ్ ఎంట్రీ లెవెల్ రూ.1,00,000; సీనియర్ లెవెల్ రూ.1,50,000.
దరఖాస్తు ఫీజు: రూ.225. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 04.06.2024.
వేదిక..
Academic Block,
ESIC MCH, Alwar,
Rajasthan- 301030.
ALSO READ:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియెరాలజీలో 65 ప్రాజెక్ట్ పోస్టులు
IITM Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియెరాలజీ(ఐఐటీఎం) ఒప్పంద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, నెట్/ సీఎస్‌ఐఆర్-యూజీసీ/ గేట్ స్కోరుతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.