EIL: ఇంజినీర్స్ ఇండియన్ లిమటెడ్ న్యూఢిల్లీలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
EIL Recruitment: న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియన్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 43 పోస్టులను భర్తీ చేయనున్నారు.
![EIL: ఇంజినీర్స్ ఇండియన్ లిమటెడ్ న్యూఢిల్లీలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు Engineers India Limited has released notification for the recruitment of management trainee posts EIL: ఇంజినీర్స్ ఇండియన్ లిమటెడ్ న్యూఢిల్లీలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/b6bf194b1034fbdf36fc088c720caf781708526862813522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
EIL Recruitment: న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియన్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు- బీఈ/బీటెక్/బీఎస్సీ (సంబంధిత ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 5వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 43
* మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
కెమికల్ ఇంజినీరింగ్: 07 పోస్టులు
అర్హత: కనీసం 65% మార్కులతో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ (కెమికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
మెకానికల్ ఇంజినీరింగ్: 21 పోస్టులు
అర్హత: కనీసం 65% మార్కులతో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ (మెకానికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
సివిల్ ఇంజినీరింగ్: 15 పోస్టులు
అర్హత: కనీసం 65% మార్కులతో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ (సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 25 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులు 28 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 30 సంవత్సరాలు,
పీడబ్ల్యూడీ(జనరల్) అభ్యర్థులు 35 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఓబీసీ-ఎన్‌సీఎల్) అభ్యర్థులు 38 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులు 40 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్, షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: భారతదేశం & విదేశాలలోని ప్రాజెక్ట్ సైట్లు.
వేతనం: నెలకు రూ.60,000.
దరఖాస్తులకు చివరి తేది: 05.03.2024.
ALSO READ:
ఎస్‌బీఐలో 80 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
SBI Recruitment: ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), అసిస్టెంట్ జనరల్ మేనేజర్(అప్లికేషన్ సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు మార్చి 04 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్ట్ంగ్, ఇంటర్వూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,425 అప్రెంటిస్ ఖాళీలు - ఈ అర్హతలుండాలి
South Eastern Coalfields Limited Recruitment: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని సౌత్-ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(ఎస్‌ఈసీఎల్) గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మైనింగ్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ విభాగాల్లో 1425 అప్రెంటిస్ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 27లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు మార్చి 15న ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)