SBI: ఎస్‌బీఐలో 80 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
SBI Recruitment: ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI Recruitment: ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), అసిస్టెంట్ జనరల్ మేనేజర్(అప్లికేషన్ సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు మార్చి 04 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్ట్ంగ్, ఇంటర్వూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 80
⏩ అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్): 23 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: రూ.36,000-63,840.
⏩ డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్): 51 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: రూ.48,170-69,810.
⏩ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్): 03 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 38 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: రూ.63,840-78,230.
⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(అప్లికేషన్ సెక్యూరిటీ): 03 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: రూ.89,890-1,00,350.
విభాగాలు: కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్.
పని ప్రదేశం: ముంబయి, నవీ ముంబయి.
దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ంగ్, ఇంటర్వూ, మెరిట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్‌లోడ్ చేయవలసిన డాక్యుమెంట్‌లు..
➥ సంక్షిప్త రెజ్యూమ్(పీడీఎఫ్).
➥ ఐడీ ప్రూఫ్(పీడీఎఫ్).
➥ పుట్టిన తేదీ ద్రువీకరణ సర్టిఫికెట్ కాపీ(పీడీఎఫ్)
➥ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్-షీట్‌లు/డిగ్రీ సర్టిఫికెట్(పీడీఎఫ్)
➥ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కాపీ(పీడీఎఫ్)
➥ కాస్ట్ సర్టిఫికెట్ కాపీ/ఓబీసీ సర్టిఫికేట్/ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (పీడీఎఫ్)
➥ దివ్యాంగ సర్టిఫికేట్ కాపీ(పీడీఎఫ్)
➥ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో.
➥ అన్ని పత్రాలు తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి.
డాక్యుమెంట్‌లు అప్‌లోడ్ చేసే విధానం:
➥ ప్రతి డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయడానికి ప్రత్యేక లింక్‌లు ఉంటాయి.
➥ సంబంధిత లింక్‌పై క్లిక్ చేయండి ""Upload""
➥ PDF, DOC లేదా DOCX ఫైల్ సేవ్ చేయబడిన స్థానాన్ని బ్రౌజ్ చేసి ఎంచుకోండి.
➥ ఫైల్‌పై క్లిక్ చేయడం ద్వారా దాన్ని ఎంచుకుని, 'అప్‌లోడ్' బటన్‌ను క్లిక్ చేయండి.
➥ అప్లికేషన్‌ను సమర్పించే ముందు డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయబడిందని మరియు సరిగ్గా యాక్సెస్ చేయబడిందని నిర్ధారించడానికి ప్రివ్యూను క్లిక్ చేయండి. ఫైల్ సైజ్ అండ్ ఫార్మాట్ సూచించిన విధంగా లేకుంటే ఎర్రర్ మేసేజ్ వస్తుంది.
➥ ఒకసారి అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్‌లను సవరించడం/మార్పు చేయడం సాధ్యం కాదు.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో ఛాయాచిత్రం/ సంతకాన్ని అప్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు చిత్రాలు స్పష్టంగా ఉన్నాయని మరియు సరిగ్గా అప్‌లోడ్ చేశారో లేదో తనిఖీ చేయాలి. ఒకవేళ ఫోటో లేదాసంతకం సరిగ్గా కనిపించనపుడు, అభ్యర్థి తన దరఖాస్తును సవరించవచ్చు మరియు ఫారమ్‌ను సమర్పించే ముందు అతని/ఆమె ఫోటో లేదా సంతకాన్ని మళ్లీ అప్‌లోడ్ చేయవచ్చు.ఫోటోలో ఫేస్ లేదా సంతకం అస్పష్టంగా ఉంటే అభ్యర్థి దరఖాస్తు తిరస్కరించబడవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04.03.2024.