DRDO: డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబ్‌లో అప్రెంటిస్ ఖాళీలు - ఐటీఐ, డిప్లొమా ఉండాలి!
పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఐటీఐ, డిప్లొమా(ఏఎన్‌ఎం) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధులు నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది..
హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా మొత్తం 101 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఐటీఐ, డిప్లొమా(ఏఎన్‌ఎం) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధులు నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డీఆర్‌డీవో ఆధ్వర్యంలో డీఆర్‌డీఎల్ పనిచేస్తుంది.
వివరాలు..
* ట్రేడ్/ టెక్నీషియన్ అప్రెంటిస్: 101
అప్రెంటిస్ వ్యవధి: ఏడాది.
1) ట్రేడ్ అప్రెంటిసెస్: 99
ట్రేడుల వారీగా ఖాళీలు: కోపా - 47, ఎలక్ట్రానిక్ మెకానిక్ - 14, ఫిట్టర్ - 05, మెషినిస్ట్ - 01, టర్నర్ - 01, కార్పెంటర్ - 02, షీట్ మెటల్ - 02, వెల్డర్ - 01, ఎలక్ట్రో ప్లేటింగ్ - 01, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ - 01, డ్రాట్స్‌మ్యాన్(మెకానికల్)-02, డ్రాట్స్‌మ్యాన్(సివిల్) - 01, సెక్రటేరియల్ ట్రైనింగ్ & మేనేజ్‌మెంట్ - 10, డీజిల్ మెకానిక్ - 02, ఫైర్‌మ్యాన్ - 04, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్ వర్కింగ్ - 03, బుక్ బైండింగ్ - 02.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉండాలి.
2) టెక్నీషియన్ అప్రెంటిస్: 02
అర్హత: డిప్లొమా(ఏఎన్‌ఎం) అర్హత ఉండాలి. 2019, 2020, 2021 సంవత్సరాల్లో పాసై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
స్టైపెండ్: నెలకు రూ.7700-రూ.8050.
దరఖాస్తు చివరి తేదీ: 18.11.2022.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో అప్రెంటిస్‌షిప్‌లు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 2022-23 సంవత్సరానికి ఏడాది టెక్నీషియన్, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. పోస్టుని అనుసరించి బీఈ, బీటెక్, డిప్లొమా, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు, ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష లేదు. వాక్-ఇన్ నవంబర్ 09న నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా వాక్-ఇన్‌కు హాజరుకావాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఈ అర్హతలు ఉండాలి!
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనేజేషన్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబరు 7 వరకు కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..