అన్వేషించండి

DRDO Jobs: డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఈ అర్హతలు ఉండాలి!

సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో కేంద్రాల్లో పోస్టులను భర్తీ చేస్తారు.

భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబరు 7 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ & కేపబిలిటి టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 1061 

1)  జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్(జేటీవో): 33 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్). డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ ఒక పాఠ్యాంశంగా ఉండాలి. (లేదా) బ్యాచిలర్స్ డిగ్రీ (హిందీ, ఇంగ్లిష్)తోపాటు హిందీ/ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేషన్ కోర్సు చేసి ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 07.12.2022 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.

2) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1(ఇంగ్లిష్ టైపింగ్): 215 పోస్టులు

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. టైపింగ్ తెలిసి ఉండాలి. కంప్యూటర్‌లో 10 నిమిషాల్లో 100 పదాలు డిక్టేషన్ రాయగలగాలి. 40 నిమిషాలు ట్రాన్‌స్క్రిప్షన్ (ఇంగ్లిష్) ఉంటుంది.  
వయోపరిమితి: 07.12.2022 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.

3) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(ఇంగ్లిష్ టైపింగ్): 123 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. టైపింగ్ తెలిసి ఉండాలి. కంప్యూటర్‌లో 10 నిమిషాల్లో 80 పదాలు డిక్టేషన్ రాయగలగాలి. 50 నిమిషాలు ట్రాన్‌స్క్రిప్షన్ (ఇంగ్లిష్) ఉంటుంది.  
వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

4) అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(ఇంగ్లిష్ టైపింగ్): 250 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి.  
వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

5) అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(హిందీ టైపింగ్): 12 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి.  
వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

6) స్టోర్ అసిస్టెంట్(ఇంగ్లిష్ టైపింగ్): 134 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి.  
వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

7) స్టోర్ అసిస్టెంట్(హిందీ టైపింగ్): 04 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి.  
వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

8) సెక్యూరిటీ అసిస్టెంట్: 41 పోస్టులు

అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. 
వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

9) వెహికల్ ఆపరేటర్: 145 పోస్టులు

అర్హత: పదోతరగతి అర్హత ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.  
వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

10) ఫైర్ ఇంజిన్ డ్రైవర్: 18 పోస్టులు

అర్హత: పదోతరగతి అర్హత ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.  
వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

11) ఫైర్‌మ్యాన్: 86 పోస్టులు

అర్హత: పదోతరగతి అర్హత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 07.12.2022 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ & కేపబిలిటి టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

జీతభత్యాలు: జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.35,400-రూ.1,12,400; స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.25,500-రూ.81,100; ఇతర పోస్టులకు రూ.19900-రూ.63200 వరకు ఉంటుంది.

పరీక్ష విధానం:

DRDO Jobs: డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఈ అర్హతలు ఉండాలి!

పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలు..

➤  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.11.2022.

  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది: 07.12.2022.

  టైర్-1 (సీబీటీ) పరీక్ష తేది: వెల్లడించాల్సి ఉంది.

Notification 
Website

:: Also Read ::

SSC Recruitment: 24,369 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ! దరఖాస్తు చేసుకోండి!
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనిద్వారా వివిధ కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 21,579 పోస్టులు, మహిళలకు 2626 పోస్టులు కేటాయించారు. పదో తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 30 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదిగా నిర్ణయించారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

UPSC Recruitment 2022: కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇలా! 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో భర్తీ చేయనుంది. పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ బీటెక్/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 10 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Hyundai CNG Sales: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Hyundai CNG Sales: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Realme GT 7 Pro Launch Date: రూ.1000 పెట్టి బుక్ చేస్తే రూ.6598 విలువైన ఆఫర్ - రియల్‌మీ జీటీ 7 ప్రో ప్రీ బుకింగ్స్ స్టార్ట్!
రూ.1000 పెట్టి బుక్ చేస్తే రూ.6598 విలువైన ఆఫర్ - రియల్‌మీ జీటీ 7 ప్రో ప్రీ బుకింగ్స్ స్టార్ట్!
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
Embed widget