CTET 2024 Results: సీటెట్ - 2024 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి-2024 ఫలితాలను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రోల్ నంబర్ వివరాలతో ఫలితాలను చూసుకోవచ్చు.
CTET 2024 Janaury Results: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి-2024 ఫలితాలను సీబీఎస్‌ఈ ఫిబ్రవరి 15న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రోల్ నంబర్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జనవరి 21న పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 135 నగరాల్లోని 3,418 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. సీటెట్ పరీక్షకు సంబంధించి రెండు పేపర్లకు కలిపి మొత్తం 26,93526 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 20 భాషల్లో సీటెట్ పరీక్షను నిర్వహించారు. సీటెట్ పరీక్ష ప్రాథమిక కీని సీబీఎస్‌ఈ ఫిబ్రవరి 7న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 10 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యతరాలను పరిగణనలోకి తీసుకొని తాజాగా ఫలితాలను సీబీఎస్‌ఈ విడుదల చేసింది.
సీటెట్ 2204 (జనవరి) ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - ctet.nic.in
➥ అక్కడ హోమ్ పేజీలోని ఫలితాలకు సంబంధించి ‘CTET Jamuary 2024 Results’ లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ అభ్యర్థులు తమ రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి SUBMIT బటన్‌పై క్లిక్ చేయాలి.
➥ సీటెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలి
సీటెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
సీటెట్ పరీక్ష ఏటా రెండుసార్లు జరుగుతుంది. పరీక్ష రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతులకు బోధించాలనుకునే వారికి పేపర్-1, 6వ తగరతి నుంచి 9వ తరగతులకు బోధించాలనుకునే వారి కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్) - 2022' నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అక్టోబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఈ పరీక్షను ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సీటెట్ స్కోరుకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావొచ్చు.
సీటెట్ స్కోరు ఉన్న వారు ఆయా రాష్ట్రాలు నిర్వహించే టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను విధిగా రాయాల్సిన అవసరం లేదు. సీటెట్ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి.