అన్వేషించండి

APPSC DyEO Results: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల, మెయిన్‌కు 3957 మంది ఎంపిక

DyEO Results: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DyEO) ఖాళీల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మే 18న విడుదల చేయనుంది.

APPSC Deputy EO Prelims Results: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DyEO) ఉద్యోగాల భర్తీకి సంబంధించి మే 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) జూన్ 27న రాత్రి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో తర్వాతి దశకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 3957 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలతోపాటు రాతపరీక్ష తుది ఆన్సర్ కీని కూడా కమిషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 

Deputy Educational Officer (DyEO) Prelims Rsults

Final Key (General Studies and Mental Ability)

APPSC DyEO Results: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల, మెయిన్‌కు 3957 మంది ఎంపిక

ఆంధ్రప్రదేశ్‌లో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి APPSC గతేడాది డిసెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 25న ప్రిలిమినరీ (స్క్రీనింగ్) రాతపరీక్ష నిర్వహించింది. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల మధ్య కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించారు. పరీక్షను ఏపీలోని  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని మే 28న కమిషన్ విడుదల చేసింది. మే 31 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించింది. తాజాగా ఫలితాలతోపాటు.. ఫైనల్ కీని కూడా కమిషన్ విడుదల చేసింది. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్ పరీక్ష నిర్వహించి ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.61,960 – రూ.1,51,370 జీతంగా చెల్లిస్తారు.

* డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (డీఈవో) పోస్టులు

ఖాళీల సంఖ్య: 38.

జోన్లవారీగా ఖాళీలు: జోన్-1: 07 పోస్టులు, జోన్-2: 12 పోస్టులు, జోన్-3: 08 పోస్టులు, జోన్-14: 11 పోస్టులు.

మెయిన్ పరీక్ష..
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 450 మార్కులు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2: ఎడ్యుకేషన్-1కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-3: ఎడ్యుకేషన్-2కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కాగా.. తప్పు సమాధానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించినవారికి కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.

కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

ALSO READ: 

17 వేలకుపైగా ఖాళీలతో 'సీజీఎల్ఈ - 2024' నోటిఫికేషన్ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ 

➥ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget