AIIMS Bibinagar: బీబీనగర్ ఎయిమ్స్‌లో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా
AIIMS: హైదరాబాద్ బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వివిధ విభాగాల్లో జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AIIMS Bibinagar Recruitment: హైదరాబాద్ బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వివిధ విభాగాల్లో జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసీఐ, ఎన్‌ఎంసీ, డీసీఐ, స్టేట్ మెడికల్ కౌన్సిల్ లేదా స్టేట్ డెంటల్ కౌన్సిల్ సభ్యత్వం కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1180, ఈడబ్ల్యూఎస్ రూ.944 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: recruitment.aiimsbibinagar@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
పోస్టుల వివరాలు..
* జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 40
పోస్టుల కేటాయింపు: యూఆర్-17, ఓబీసీ-10, ఎస్సీ-06, ఎస్టీ-03, ఈడబ్ల్యూఎస్-04.
➥ జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్): 37 పోస్టులు
➥ జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) డెన్‌టిస్ట్రీ: 03 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసీఐ/ఎన్‌ఎంసీ/డీసీఐ/స్టేట్ మెడికల్ కౌన్సిల్/స్టేట్ డెంటల్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి: 19.12.2023 నాటికి 37 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.1180, ఈడబ్ల్యూఎస్ రూ.944, చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు Bank of Baroda, AIIMS, Bibinagar, ACC: 66120100000006, IFSC: BARB0DBCHND పేరిట ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఎయిమ్స్ బీబీనగర్ విద్యార్థులైతే ఎంబీబీఎస్‌లో మెరిట్ ఆధారంగా, ఇతరులకు INICET పరీక్షలో ర్యాంకు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పేస్కేలు: లెవల్-10 పే మ్యాట్రిక్స్ (7th CPC) కింద వేతనం, ఇతర అలవెన్సులు ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది: 19.12.2023.
ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు రిపోర్టింగ్ సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు..
➥ పుట్టినతేదీ సర్టిఫికేట్
➥ పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికేట్
➥ ఎంబీబీఎస్/బీడీఎస్ డిగ్రీ సర్టిఫికేట్
➥ ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్
➥ ఎంబీబీఎస్/బీడీఎస్ సర్టిఫికేట్లు
➥ యూజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
➥ INICET ర్యాంకు కార్డు
➥ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ రిజిస్ట్రేషన్ (FMGE test), స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
➥ క్యాస్ట్ సర్టిఫికేట్
➥ ఫీజు చెల్లింపు రశీదు.
ALSO READ:
మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల, మహిళలకు ప్రత్యేకం
త్రివిధ దళాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 'మిలిటరీ నర్సింగ్ సర్వీస్ 2023-24' నోటిఫికేషన్ వెలువడింది. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబర్ 11 నుంచి 26 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..